HYD Crime: హైదరాబాద్‌లో కలకలం.. పట్టపగలే రౌడీ షీటర్ మర్డర్.. షాకింగ్ వీడియో!

హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట ఎల్లమ్మబండలో టీ తాగుతున్న షేక్ మహమూద్‌ అనే రౌడీషీటర్‌ను ముగ్గురు యువకులు విచక్షణా రహితంగా కత్తులు.. వేటకొడవలితో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడి జరిగిన తర్వాత నిందితులు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

New Update
Jagadgirigutta Crime News

Jagadgirigutta Crime News

HYD Crime: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో జరిగిన దారుణమైన హత్య దిగ్భ్రాంతికి గురిచేసింది. రౌడీషీటర్ షేక్‌ మహమూద్‌ను అందరూ చూస్తుండగానే.. ముగ్గురు యువకులు కత్తులు, వేటకొడవలితో అత్యంత కిరాతకంగా హత్య చేశారు. టీ తాగుతున్న సమయంలో జరిగిన ఈ దారుణం చూసి స్థానికులు భయంతో పరుగుపెట్టారు.  స్థానిక వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలో(Jagadgirigutta Crime News) మంగళవారం సాయంత్రం జరిగిన ఒక దారుణమైన హత్య సంచలనం సృష్టించింది. ఎల్లమ్మబండలో టీ తాగుతున్న షేక్ మహమూద్‌ అనే రౌడీషీటర్‌ను ముగ్గురు యువకులు విచక్షణా రహితంగా కత్తులు.. వేటకొడవలితో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన జరిగిన తర్వాత నిందితులు నేరుగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోవడం గమనార్హం. 

ఇది కూడా చదవండి: పెళ్లైన 10 రోజులకే వధువు జంప్.. ఇన్‌స్టాలో ఆ వీడియోలు చూసి భర్త మృతి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన షేక్ మహమూద్‌ (35) ముషీరాబాద్‌కు చెందిన పాత నేరస్తుడుగా అనుమాస్తున్నారు. అతనిపై ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్‌ కేసుతోపాటు మొత్తం 13 కేసులు కూడా అతనిపై నమోదయ్యాయి. మహమూద్‌ను ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడటానికి ఎల్లమ్మబండకు పిలిపించారు. అక్కడ అతను ఓ రెస్టారెంట్‌లో కూర్చుని టీ తాగుతుండగా.. కరీం, జహంగీర్, ఫజల్ అనే ముగ్గురు వ్యక్తులు ఆటోలో వచ్చి.. అతనిపై కత్తులు, వేటకొడవలితో దాడి చేశారు. వారు మహమూద్‌ను బయటకు లాగి కడుపులో.. వీపుపై పలుమార్లు పొడిచారు. అంతేకాకుండా వేటకొడవలితో అతని తలపై వెనుక భాగంలో కొట్టడంతో తీవ్రమైన గాయాలై అక్కడికక్కడే మరణించాడు. 

హోటల్ మెట్ల దగ్గర రక్తపు మడుగులో పడివున్న మహమూద్‌ను చూసి స్థానికులు, హోటల్ సిబ్బంది భయంతో పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీంచారు. హైదరాబాద్ బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ నరేష్ రెడ్డితో సహా ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీమ్, ఫింగర్‌ప్రింట్స్ టీమ్‌లు కూడా ఆధారాలు సేకరించారు. ప్రాథమిక దర్యాప్తులో.. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డీసీపీ తెలిపారు. హత్య చేసిన అనంతరం నిందితులు లొంగిపోవడంతో కేసు త్వరగా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఈ కేసులో పూర్తి వివరాలు, హత్యకు గల అసలు కారణాలు దర్యాప్తు తర్వాత తెలుస్తాయి.

ఇది కూడా చదవండి: మరో ఘోర విమాన ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ - ఫొటోలు చూశారా?

Advertisment
తాజా కథనాలు