/rtv/media/media_files/2025/08/08/marriage-2025-08-08-12-54-24.jpg)
marriage
UP Crime: పెళ్లి అనేది కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. రెండు కుటుంబాల అనుబంధం. ఈ పవిత్ర బంధం నూతన జీవితానికి నాంది పలుకుతుంది. ప్రేమ, నమ్మకం, ఆప్యాయత అనే పునాదులపై పెళ్లి అనే ఇల్లు నిర్మితమవుతుంది. ఒకరికొకరు తోడుగా ఉంటూ.. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, జీవితాన్ని పంచుకోవడమే పెళ్లి. ఇది బాధ్యతతో కూడిన ప్రయాణం. ప్రతి బంధానికీ కొంత కష్టం ఉంటుంది. కానీ పెళ్లి జీవితంలోని కొన్ని సవాళ్లను కలిసి ఎదుర్కొని.. ఒకరికొకరు అండగా నిలబడడం నేర్పుతుంది. అయితే యూపీలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు తప్పిపోయారు అనుకుంటే చివరి పెళ్లి చేసుకున్నారు.
కలిసి జీవించాలంటూ..
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ఇద్దరు కజిన్స్ తమ కుటుంబాలను వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు తిరిగి వచ్చి పెళ్లి చేసుకున్నామని, కలిసి జీవించాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ఒకరు అబ్బాయి దుస్తులు ధరించి, మరొకరు పాపిట్లో సింధూరం పెట్టుకుని పోలీసు స్టేషన్‌కు రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అమర్ ఉజాలా నివేదిక ప్రకారం.. అమ్మాయిల్లో ఒకరి తండ్రి తన కూతురు కనిపించడం లేదంటూ IGRS పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశారు. తన కూతురును ఆమె కజిన్ మభ్యపెట్టి తీసుకువెళ్లిందని.. బహుశా ఆమెను ఎక్కడైనా అమ్మేసి ఉండొచ్చని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు లక్నోకు చేరడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు కనిపించకుండా పోయిన అమ్మాయిని సంప్రదించి.. ఆమెకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆగస్టు 7న ఇద్దరు అమ్మాయిలు పోలీసు స్టేషన్‌కు రాగా.. అక్కడ బంధువులు, పోలీసులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: పుణ్య స్నానానికి వెళ్లి వస్తుండగా విషాదం.. లారీ ఢీకొని చిన్నారితో సహా...
తాము గత ఒకటిన్నర సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని.. కలిసి జీవించాలని నిర్ణయించుకున్నామని వారు పోలీసులకు తెలిపారు. పోలీసు స్టేషన్‌కు రాకముందు గుడిలో పెళ్లి చేసుకున్నామని కూడా వారు చెప్పారు.బంధువులు వారిని ఇంటికి తిరిగి వెళ్లమని ఎంతగా బతిమాలినా.. ఆ అమ్మాయిలు తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి నిరాకరించారు. వారిని సురక్షితంగా బయటకు పంపించడానికి పోలీసులు తోడుగా వెళ్లారు. వారిలో చిన్న అమ్మాయి 12వ తరగతి వరకు చదువుకోగా, మరొక అమ్మాయి 10వ తరగతి వరకు చదువుకుంది. ఒకప్పుడు తాము సోదరీమణులమని.. ఇప్పుడు తాము సహచరులమని వారు పోలీసులకు వివరించారు. ఈ ఘటన ముజఫర్‌నగర్‌లో సంచలనం సృష్టించింది. భారతదేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లేనప్పటికీ.. సుప్రీం కోర్టు 2018లో స్వలింగ సంపర్కాన్ని నేరం కాదంటూ సెక్షన్ 377ను రద్దు చేసింది. ఈ జంట తమను వివాహితులుగా భావిస్తున్నామని.. కలిసి జీవించాలని కోరుకుంటున్నామని పోలీసులకు తెలిపారు.
ఇది కూడా చదవండి: ఇదే ఘోరం రా దేవుడా.. కుక్క నోట్లో మనిషి చేయి..3కి.మీ దూరంలో పేగులు