TG NEWS: మూడు రోజుల్లోనే ఘోరం! పెళ్లి కూతురిగా వెళ్లి.. శవంగా ఇంటికి!

కరీంనగర్ జిల్లా వెల్గటూరు గ్రామానికి చెందిన అఖిల అనే యువతికి పెళ్ళైన మూడు రోజులకే ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించింది. పరీక్ష రాసి తిరిగి భర్తతో బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. 

New Update

TG NEWS: ఎన్నో ఆశలు, కలలతో పెళ్లి చేసుకున్నారు.. దంపతులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగింది! పెళ్ళైన మూడు రోజులకే నవ వధువు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. ఈ ఘోర విషాదం కరీంనగర్ జిల్లా తిమ్మాపురంలో చోటుచేసుకుంది. కరీంనగర్ జిల్లా వెల్గటూరు గ్రామానికి చెందిన అఖిల అనే యువతికి మూడు రోజుల క్రితమే వివాహం జరిగింది. అయితే  ఈరోజు పరీక్ష రాసేందుకు భర్తతో కలిసి తిమ్మాపురంలోని ఓ ప్రైవేట్ కాలేజీకి బైక్ పై వెళ్ళింది. కానీ.. ఇదే తనకు ఆఖరి రోజు అవుతుందని ఊహించలేకపోయింది. పరీక్ష రాసి తిరిగి వెళ్తుండగా ఈ నవ దంపతులు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. LMD దగ్గర వీరు వెళ్తున్న బైక్ ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అఖిల అక్కడిక్కడే మృతి చెందగా.. ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. పెళ్ళైన మూడు రోజులకే నవ వధువు మృతి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లి తర్వాత పిల్లాపాపలతో సంతోషంగా ఉంటుందనుకున్న కూతురు ఇక లేదని తెలియడంతో అఖిల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు