/rtv/media/media_files/2025/08/02/amalapuram-incident-2025-08-02-16-44-28.jpg)
Amalapuram incident
Crime: రోజురోజుకి సమాజంలో మానవ సంబధాలు మంటగలిసిపోతున్నాయి. డబ్బు, ఆస్తుల కోసం కన్నవారిని, కట్టుకున్న వారిని కడతేర్చే స్థాయికి దిగజారుతున్నారు మనుషులు. తాజాగా ఇలాంటి మరో ఘటన సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తండ్రిని చంపడానికి సిద్దమయ్యాడు దుర్మార్గపు కొడుకు. అదృష్టవశాత్తు అతడి ప్లాన్ ఫలించకపోవడంతో ఆ తండ్రి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ అమానుష ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వెలుగు చూసింది.
Also Read : రైతుల అకౌంట్లోకి రూ.7000 జమ.. ఇలా చెక్ చేసుకోండి..!
ఇన్సూరెన్స్ డబ్బు కోసం
వివరాల్లోకి వెళితే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం సాకుర్రు గ్రామానికి చెందిన విప్పర్తి హర్షవర్ధన్ ఆర్థికంగా నష్టపోవడంతో తండ్రిని చంపేందుకు సిద్దమయ్యాడు. తండ్రిని చంపేస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని హత్యకు ప్లాన్ చేశాడు. కారుతో గుద్ది యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని అనుకున్నాడు. ప్లాన్ ప్రకారం.. బయట నుంచి ఒక కారు అద్దెకు తెచ్చుకున్న హర్షవర్ధన్.. తండ్రి వెంకటరమణను హైవై పైకి రమ్మన్నాడు. ఇదంతా తెలియని వెంకటరమణ కొడుకు పిలవగానే హైవే పైకి వెళ్ళాడు. తండ్రి రాగానే కారుతో గుద్ది యాక్సిడెంట్ గా క్రియేట్ చేశాడు. కానీ, అదృష్టవశాత్తు సమీపంలోని వ్యక్తులు చూడడంతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు.
ఆ తర్వాత యాక్సిడెంట్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు బండారం బయటపడింది. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కొడుకే తండ్రిని చంపేందుకు స్కెచ్ వేసినట్లు విచారణలో తేలింది. దీంతో నిందితుడు హర్షవర్ధన్ ని అరెస్ట్ చేసి.. రిమాండ్ కి తరలించారు పోలీసులు. అతడిపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, రూరల్ ఎస్సై శేఖర్ బాబు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు బయటపెట్టారు. అయితే ఒక రాజకీయ నాయకుడి అనుచరుడిగా తిరుగుతూ ఈజీమనీకి అలవాటు పడిన హర్షవర్ధన్ ఆర్థికంగా నష్టపోవడంతో ఏం చేయాలో తోచలేదు. దీంతో సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తండ్రిని హతమార్చడానికి ఒడిగట్టాడు. కారుతో గుద్ది యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని పథకం వేశాడు.
Also Read : AP కానిస్టేబుల్ ఫలితాలు 2025 రిలీజ్.. ఇలా చెక్ చేసుకోండి!
యూపీలో మరో ఘటన
ఇదిలా ఉంటే యూపీలో బరేలీలోని ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కట్టుకున్న భర్తను బతికుండగానే పాతిపెట్టాలని అనుకుంది భార్య. వివరాల్లోకి వెళితే ఇజ్జత్‌నగర్ లో నివాసం ఉంటున్న రాజీవ్ భార్య సాధన తన భర్తను చంపడానికి తన ఐదుగురు సోదరులు, కొంతమంది గుండాలతో కలిసి స్కెచ్ వేసింది. ప్లాన్ ప్రకారం.. జులై 21న అర్థరాత్రి సమయంలో ఆ గుండాలు రాజీవ్ ఇంట్లోనే అతడి పై దాడి చేశారు. రాజీవ్ కాళ్ళు, చేతులు విరిచేసి సజీవంగా పాతిపెట్టడానికి ప్లాన్ చేశారు. అందులో భాగంగానే గంజ్ ప్రాంతంలోని ఒక అడవికి తీసుకెళ్లి గొయ్యి తవ్వారు. కానీ అదృష్టవశాత్తు పాతి పెట్టేముందు అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి కూడడంతో రాజీవ్ ప్రాణాలతో బయట పడ్డాడు. ఆ వ్యక్తిని చూడగానే భయపడిపోయిన గూండాలు రాజీవ్ ని వదిలేసి పారిపోయారు. అనంతరం రాజీవ్ తండ్రి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.