/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)
Hyderabad Crime News
HYD Crime: ఈ తరం బాలబాలికలు సున్నితమైన మనసు కలిగి ఉంటున్నారు. చిన్నమాట కూడా పడలేకపోతున్నారు. ఎవరైనా కసురుకున్నా, కొంచెం గట్టిగా మాట్లాడినా, తమ తప్పులను ఎత్తి చూపినా వారు గుండె పగిలినంతగా బాధపడుతున్నారు. తామేదో నేరం చేశామనే విధంగా ఆలోచిస్తూ తమ చిన్ని గుండెలను గాయ పరచుకుంటున్నారు. ఆ వేదనతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు కన్నీటిని మిగిలిస్తున్నారు. కుటుంబంతో పాటు బంధుమిత్రులను తీరని ఆవేదనను కలిగిస్తున్నారు. నిన్నటి దాకా తమ కళ్ళ ముందు ఆడుతూపాడుతూ తిరిగిన చిన్నారులకు ఇంతటి కష్టం ఏమొచ్చిందని ఇరుగుపొరుగు వారు షాక్‌కు గురవుతున్నారు. అందులోనూ వారు బలవంతంగా ఊపిరి వదిలినప్పుడు తల్లిదండ్రుల వేదన చెప్పలేనిదిగా ఉంటోంది. కంటతడి పెట్టించే ఇటువంటి బాధాకరమైన ఘటనే హైదరాబాద్‌లోని కెపిహెచ్‌పీ కాలనీలో జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు కాలనీవాసులను విషాదానికి గురి చేసింది.
చదువులో వెనబడిందని..
వివరాల్లోకి వెళ్తే.. హరినారాయణమూర్తి కుటుంబం కెపిహెచ్‌పీలోని మంజీరా హోమ్స్ 17వ అంతస్తులో నివాసం ఉంటోంది. ఆ దంపతులకు లాస్య ప్రియ (13) అనే కుమార్తె ఉంది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలికను వారు అడ్డగుట్టలోని నారాయణ స్కూల్లో చదివిస్తున్నారు. ప్రస్తుతం లాస్యప్రియ తొమ్మిదో తరగతిలో ఉంది. అయితే చదువులో ఆమె వెనబడడం వల్ల తరచూ తనలో తను మనసును చిన్నబుచ్చుకునేదని తెలుస్తోంది. ఈ క్రమంలో అడ్డగుట్టలోని నారాయణ స్కూల్లో పేరేంట్-టీచర్ మీటింగును నిర్వహించారు. ఆ మీటింగులో ఉపాధ్యాయులు ఆమె చదువులో వెనకబడుతున్న విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. చదువుపై లాస్య ప్రియ ఫోకస్ పెట్టడం లేదన్నారు. ఇలానే ఉంటే కష్టమని లాస్యప్రియ తల్లిదండ్రులతో అన్నారు.
ఇది కూడా చదవండి: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 40 ఏళ్ల వ్యక్తితో బాలికకు వివాహం!
అక్కడే ఉండి ఆ మాటలను విన్న లాస్యప్రియ మనసు నొచ్చుకుంది. మౌనంగా ఉండిపోయి తనలో తను బాధపడింది. కుటుంబ సభ్యులు పలకరించినా కూడా సరిగ్గా మాట్లాడలేదని తెలుస్తోంది. చిన్నారి మనసు గాయపడడంతో రాత్రి 9 గంటల సమయంలో ఇంటి బాత్రూంలోకి వెళ్ళిందని సమాచారం. అక్కడ కిటికీ అద్దాలను తొలగించి అక్కడి నుంచి లాస్య ప్రియ దూకినట్లు తెలుస్తోంది. 17వ అంతస్తు నుంచి దూకడంతో బాలిక అక్కడికక్కడే తన చివరి శ్వాసను వదిలేసింది. ఊపిరి వదిలిన ఆమె బాడీ ముక్కలుగా అయ్యి అటొకటి, ఇటొకటిగా పడిపోయింది. ఈ సడెన్ సంఘటనతో అక్కడున్న వారు షాక్ అయ్యారు. కాసేపటికి తేరుకుని తమ అపార్ట్మెంట్‌లోని లాస్యప్రియగా గుర్తించి బాధకు గురయ్యారు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు వెంటనే క్రిందకు వచ్చి బాలిక బాడీని చూసి కుప్పకూలిపోయారు. కన్నపేగు బంధం దూరమయ్యే సరికి ఆవేదనకు లోనయ్యారు. ఈ క్రమంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారిచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. కేసును నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: బెంగళూరులో విషాదం.. 13 ఏళ్ల బాలుడు దారుణ హ*త్య
(HYD Crime | crime news | Latest News | telugu-news | crime )