Hyderabad: హైదరాబాద్ లో కసాయి భర్త.. ప్రియురాలి కోసం భార్య, పిల్లల్ని ఏం చేశాడంటే!

ప్రియురాలి కోసం  కట్టుకున్న భార్య, కన్న పిల్లలు అనే కనీస కనికరం లేకుండా ఇంట్లో నుంచి గెంటేశాడు  కసాయి భర్త. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ లోని వెంకటరెడ్డి నగర్ లో వెలుగుచూసింది.

New Update

Hyderabad:  చక్కగా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తే సరిపోదు.. దానికి తగ్గట్లుగా కాస్త బుద్ధికూడా ఉండాలి అంటూ ఇతడిని తిట్టిపోస్తున్నారు జనాలు. మరి ఇతను చేసిన పని అలాంటిది. ప్రియురాలి మోజులో పడి కట్టుకున్న భార్య, కన్న పిల్లలనే కనికరం లేకుండా ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు ఈ కసాయి భర్త. భర్త గెంటేయడంతో దిక్కుతోచని ఆ భార్య,పిల్లలు న్యాయం కోసం రోడ్డున పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్  ఉప్పల్ లోని వెంకటరెడ్డి నగర్ లో వెలుగుచూసింది.

భార్య పిల్లల్ని గెంటేసి.. 

వివరాల్లోకి వెళితే... లావణ్య అనే మహిళకు 2009 లో పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న నాగరాజుతో వివాహం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా నాగరాజు మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. దీంతో భార్య భర్తల మధ్య తరచూ వాగ్వాదం జరిగేది. ఈ క్రమంలో భర్త నాగరాజు దారుణానికి తెగించాడు. ప్రియురాలి కోసం భార్యను, ఇద్దరు పిల్లల్ని ఇంటి నుంచి గెంటేసి తాళం వేశాడు. భర్త గెంటేయడంతో భార్య, పిల్లలు రోడ్డున పడ్డారు. దీంతో భార్య లావణ్య తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ పోలీస్ మెట్లెక్కింది. 

వాహేతర సంబంధాల కోసం కట్టుకున్న వారిని హతమార్చిడం, హింసపెట్టడం  ఈ మధ్య ఓ ట్రెండ్ అయిపోయింది. రోజుకో భర్త లేదా భార్య వివాహేతర సంబంధాల కారణంగా బలవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రియురాలు, ప్రియుడు మోజులో పడి  కొంతమంది కట్టుకున్న వారిని,  కన్న పిల్లలను కూడా వదిలేయడనికి వెనకాడడం లేదు!  ఇటీవలే నల్గొండ జిల్లాలో ఓ మహిళ ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన ప్రియుడి కోసం ఏడాదిన్నర పసికందును బస్ స్టాండ్ లో నిర్దాక్షిణ్యంగా వదిలేసి వెళ్ళింది. బస్ స్టాప్ లో వదిలేసి వెళ్ళిపోయిన తల్లి కోసం ఆ బిడ్డ అమ్మా.. అమ్మా అంటూ ఏడుస్తుంటే అక్కడున్న వారందరి గుండె తరుక్కుపోయింది. బస్ డిపో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా.. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా  తల్లిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులు బాబును తండ్రికి అప్పగించారు. 

ఇదిలా ఉంటే గురుగ్రామ్ లో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు యూట్యూబ్ లో చూసి స్కెచ్ వేసింది ఓ భార్య. అయితే గురుగ్రామ్ లో నివాసం ఉంటున్న విక్రమ్ - సోనీ దేవి దంపతలకు పెళ్ళై మూడేళ్లు కూతురు ఉంది. పెళ్ళై పాప ఉన్నప్పటికీ సోనీ దేవి పొరుగింటి రవీందర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో ఆమె రవీందర్ తో సన్నిహితంగా ఉన్న ఓ వీడియోను చూసింది. దీంతో ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది. అప్పుడు భర్త విక్రమ్ సోనీ దేవిని మందలించాడు. ఇక అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరగడం మొదలయ్యాయి. దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని అనుకున్న సోనీ దేవి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు స్కెచ్ వేసింది. ఎలా చంపాలి అనే దానికోసం యూట్యూబ్ లో వీడియోలు కూడా చూసింది. చివరికి జులై 26న ప్రియుడితో భర్తను హత్య చేయించింది.  

Also Read: Ap Road Accident: ఏపీలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు స్పాట్‌డెడ్

Advertisment
తాజా కథనాలు