Crime: వీడు తండ్రి కాదు రాక్షసుడు.. కన్న కూతురు ముందే ఏం చేశాడంటే..!!

బీహార్‌లోని దర్భంగా మెడికల్ కాలేజీ ప్రాంగణంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. తండ్రి, తన కూతురి కులాంతర వివాహం చేసుకుందని అల్లుడిని ఆమె కళ్ళముందే కాల్చి చంపాడు. మృతుడు రాహుల్ కుమార్ (25) అనే బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిగా గుర్తింపు.

New Update

Crime: బీహార్‌లో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఒక తండ్రి, తన కూతురి ప్రేమను అంగీకరించలేక అల్లుడిని ఆమె కళ్ళముందే కాల్చి చంపాడు. ఈ సంఘటన దర్భంగా మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జరిగింది. కులాంతర వివాహం చేసుకున్న రాహుల్ కుమార్ (25) అనే బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి ఈ దారుణానికి బలయ్యాడు. తన తండ్రి ప్రేమశంకర్ ఝానే ఈ హత్యకు పాల్పడ్డాడని.. తన కుటుంబ సభ్యులంతా కలిసి ఈ ఘాతుకానికి కుట్ర పన్నారని మృతుడి భార్య తన్నూ ఆరోపిస్తోంది. స్థానిక వివరాల ప్రకారం.. బీహార్‌లోని దర్భంగా మెడికల్ కాలేజీలో అత్యంత దారుణమైన హత్య జరిగింది. తన కూతురిని ప్రేమించి.. కులాంతర వివాహం చేసుకున్న యువకుడిపై కోపం పెంచుకున్నాడు. ఆమె తండ్రి అందరూ చూస్తుండగానే.. ఆమె కళ్ళముందే తుపాకీతో కాల్చి ఆ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. 

అల్లుడిని కాల్చి చంపిన మామ..

మరణించిన యువకుడు రాహుల్ కుమార్ (25).. దర్భంగా మెడికల్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థి. అదే కాలేజీలో ఫస్ట్ ఇయర్ నర్సింగ్ చదువుతున్న తన్నూ ప్రియ అనే యువతిని అతను ప్రేమించాడు. అయితే తన్నూ తండ్రి ప్రేమ్‌శంకర్ ఝా వారి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించాడు. అయినప్పటికీ.. నాలుగు నెలల క్రితం రాహుల్, తన్నూ కులాంతర వివాహం చేసుకుని సంతోషంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న తన్నూ తండ్రి ప్రేమ్‌శంకర్ ఝా.. వారిద్దరినీ చంపడానికి  ఫ్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ప్రేమ్‌శంకర్ ఝా దర్భంగా మెడికల్ కాలేజీకి వచ్చి రాహుల్‌ను కలిశాడు. వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. అది తీవ్ర ఘర్షణకు దారితీయడంతో ప్రేమ్‌శంకర్ ఝా తన వద్ద ఉన్న తుపాకీతో రాహుల్‌ను కాల్చాడు. 

ఇది కూడా చదవండి: భార్యను కాపాడబోయి భర్త, భార్య చెల్లెలు మృతి .. బిగ్ ట్విస్ట్ ఏంటంటే

ఈ దారుణ ఘటన జరుగుతున్నప్పుడు రాహుల్ భార్య తన్నూ ప్రియ అక్కడే ఉంది. తన కళ్ల ముందే తన భర్త హత్యకు గురికావడంతో ఆమె షాక్‌లోకి వెళ్లిపోయింది. హత్య తర్వాత.. కాలేజీ విద్యార్థులు ప్రేమ్‌శంకర్ ఝాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రేమ్‌శంకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన గురించి తన్నూ ప్రియ మాట్లాడుతూ.. తన తండ్రితో పాటు తన కుటుంబ సభ్యులందరూ కలిసి తన భర్తను చంపడానికి కుట్ర పన్నారని ఆరోపించింది. కులాంతర వివాహం నేపథ్యంలో ఇలా హత్య చేయడటంపై మృతుడి కుంటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నిదింతుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో కలకలం.. పట్టపగలే రౌడీ షీటర్ మర్డర్.. షాకింగ్ వీడియో!

Advertisment
తాజా కథనాలు