Crime News: ప్రియుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని.. 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు..!
తాను ప్రేమించిన వ్యక్తి వేరే మహిళను పెళ్లి చేసుకోవడాన్ని ఓ మహిళా టెకీ తట్టుకోలేకపోయింది. అతడి పేరుతో నకిలీ ఈ-మెయిల్ ఐడీలు, డార్క్ వెబ్, వీపీఎన్ క్రియేట్ చేసింది. ఆపై 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపు మెసేజ్లు పంపింది. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.