TG Crime: జడ్చర్లలో ఘోరం.. ఏడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం!

జడ్చర్లలోని 167 నంబర్ ఓ కాలనీలో ఏడేళ్ల చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారం చేశారు. వారిలో చిన్నారి సొంత అన్న కూడా ఉన్నట్లు సమాచారం. 3 రోజుల క్రితం పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డారు.

New Update
Jadcharla Gang Raped

Jadcharla Gang Raped

TG Crime: నేటి కాలంలో సామూహిక అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా మహిళలపై, బాలికలపై కామాంధులు అత్యాచారం చేయటం తోపాటు హత్యలు కూడా చేస్తున్నారు. ఎన్ని చట్టాలు ఉన్నా..? ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినా.. ఏదో ఒక మూలన ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజుల్లో అత్యాచారం అనేది మానవత్వాన్ని మచ్చుతూనే ఘోర నేరంగా ఎక్కువగా మారింది. ఇది శారీరకంగా జరిగే నేరంతోపాటు మహిళలపై భద్రత లేక ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి కామ పిశాచాల మధ్య మహిళలు, చిన్నారుల జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అలాంటి ఘటన జడ్చర్లలో కలకలం రేపింది.

ఏడేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం: 

స్థానిక వివరాల ప్రకారం.. జడ్చర్లలోని 167 నంబర్ ఓ కాలనీలో నివాసం ఉంటున్న ఏడేళ్ల చిన్నారిపై ఐదుగురు బాలురు సామూహిక అత్యాచారం చేశారు. వారిలో చిన్నారి సొంత అన్న కూడా ఉన్నట్లు సమాచారం. చిన్నారిపై కాలనీలో జరిగిన అత్యాచార ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపుతోంది. ఏడు సంవత్సరాల బాలికపై 3 రోజుల క్రితం పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లింది. చిన్నారిపై చుట్టుపక్కల ఇళ్లకు చెందిన ఐదుగురు బాలురు ఈ దారుణానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇంటర్‌ విద్యార్థితోపాటు మరో నలుగురు ఉన్నారు.  బాలికపై అత్యాచారం చేసి ఏమీ తెలియనట్లు జారుకున్నారు. తర్వాత బాలికకు కడుపులో నొప్పి వస్తుందని చెప్పగా.. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి చిన్నారిపై అత్యాచారం జరిగిందని తెలిపారు. అనంతరం ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

ఇది కూడా చదవండి: కోనసీమలో క్షుద్ర పూజల కలకలం.. 30 అడుగుల గొయ్యి తవ్వి..

రంగంలోకి దిగిన పోలీసులు ఆస్పత్రికి చేరుకుని చిన్నారిని పరిశీలించారు. చిన్నారిని విచారించగా.. తాను పక్కింట్లో ఆడుకోవడానికి వెళ్లిన్నప్పుడు అన్న, స్నేహితులు కలిసి  ఏదో చేశారని చిన్నారి చెప్పింది. వైద్య పరీక్షల అనంతరం చిన్నారిని సఖి కేంద్రానికి పంపారు. మైనర్ నిందితులను అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు. ఐపీసీ 376, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అయితే భారతదేశంలో అత్యాచారం చేసిన నిందితులకు చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. IPC 376, 376(1) సెక్షన్‌ ప్రకారం.. రేపు, సాధారణ అత్యాచారం చేస్తే10 సంవత్సరాల జైలుశిక్ష, గరిష్ఠంగా జీవితఖైదు విధిస్తారు. కొన్ని సందర్భాల్లో మరణశిక్ష కూడా విధించవచ్చు. అంతే కాకుండా బాధితురాలి వైద్యం కోసం, పునరావాసానికి ఉపయోగపడేలా ఆర్ధిక నష్ట పరిహారం కూడా ఇవ్వాల్సి వస్తుంది. పిల్లలపై చేసిన నేరాలు అత్యంత కఠినంగా ఉంటాయి. సెక్షన్‌ 376A, 376AB ప్రకారం.. జీవిత ఖైదు, మరణశిక్ష ఉంటుంది.

ఇది కూడా చదవండి: తల్లి ఒడిలో ఉండాల్సిన బిడ్డా... అనాథగా శిశు విహార్‌ల్లో రెండు నెలల పసికందు

crime news | Latest News | telugu-news gang-raped)

Advertisment
తాజా కథనాలు