Operation Muskaan : ఆపరేషన్‌ ముస్కాన్‌లో 7,678 మంది చిన్నారుల విముక్తి

తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ మంచి ఫలితాలను ఇస్తోంది. అందులో భాగంగా వేలాదిమంది చిన్నారులను పోలీసులు రక్షించారు.రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న బాలకార్మికులను రక్షించిన పోలీసులు వారి కుటుంబాలకు అప్పగించారు.

New Update
Operation Muskaan

Operation Muskaan

Operation Muskaan : తెలంగాణ పోలీసులు చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ మంచి ఫలితాలను ఇస్తోంది. అందులో భాగంగా వేలాదిమంది చిన్నారులను పోలీసులు రక్షించారు.రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న బాలకార్మికులను రక్షించిన పోలీసులు వారి కుటుంబాలకు అప్పగించారు. ఈ ఆప‌రేష‌న్‌కు సంబంధించిన వివరాలను ఉమెన్ సేఫ్టీ వింగ్ డీజీ చారు సిన్హా మీడియాకు వివరించారు. ఈ ఆపరేషన్ లో 7,678 మంది చిన్నారుల‌ను ర‌క్షించారు.వారిని త‌ల్లి దండ్రుల‌కు అప్పగించినట్టు చారుసిన్హా తెలిపారు. అందులో  7,149 మంది బాలురు, 529 మంది బాలికల ఉన్నట్లు వెల్లడించారు. పోలీసులు రక్షించిన వారిలో ఎక్కువగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల నుంచే 3,783 చిన్నారులు ఉన్నారు. నలుగురు చిన్నారులు నేపాల్‌కు చెందిన వారిగా గుర్తించారు. 

 పోలీసులు రక్షించిన వారిలో 6,718 మంది బాలకార్మిలుగా పనిచేస్తున్నారు. స్ట్రీట్‌ చిల్డ్రన్స్‌ 357, భిక్షాటన చేస్తున్న వారు 42 మంది ఉన్నట్లు తెలిపారు. ఇతర పనులలో 559 మంది ఉన్నట్లు గుర్తించారు. పిల్లలను బాల కార్మికులుగా మార్చుతున్న నిందితులపై 1,713 కేసులు పెట్టామని చారుసిన్హా తెలిపారు. వారిలో1,718 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కాపాడిన పిల్లలలో 6,593 మంది పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించారు. 1,049 మంది చిన్నారులను రెస్క్యూ హోంకు తరలించారు. ఈ ఆపరేషన్‌ను ఒకే నెలలో జులై 1 నుండి 31 వరకు పోలీస్ శాఖ, ,లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్,చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్,రెవెన్యూ, చైల్డ్ వెల్ఫేర్ విభాగాలు సంయుక్తంగా నిర్వహించాయని  పోలీసులు తెలిపారు.

మరోవైపు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ జగిత్యాల జిల్లాలో విజయవంతంగా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నమన్నారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం ఒక్కో సబ్ డివిజన్ పరిధిలో ఒక సబ్- ఇన్స్ పెక్టర్, ముగ్గురు కానిస్టేబుల్స్, ఒక మహిళ కానిస్టేబుల్ ను ప్రత్యేకంగా కేటాయించామన్నారు. చైల్డ్ లైన్ తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్చంద సంస్థలను గుర్తించి జులై 1 నుండి 31 వరకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి 36 మంది బాలకార్మికులను గుర్తించి CWC (చైల్డ్ వెల్ఫేర్ కమిటీ) ముందు హాజరు పరిచయమని వివరించారు.

బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మానందరిపైనా ఉన్నదని, బాల కార్మిక వ్యవస్థ నిర్ములన కోసం బాధ్యతాయుతంగా కృషి చేయాలని, బాలల హక్కులను, బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్న, ఎక్కడైనా పనిచేసిన, తప్పిపోయిన వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే డయల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వగలరని తెలిపారు. బాలకార్మికులుగా పెట్టుకున్న వారిపై కూడా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఇది కూడా చదవండి: సృష్టి కేసులో సంచలనం..సరోగసి చేయకున్న చేసినట్లు నమ్మించాం...డాక్టర్ నమ్రత వాంగ్మూలం


Advertisment
తాజా కథనాలు