/rtv/media/media_files/2025/08/01/actress-kalpika-ganesh-father-police-complaint-against-her-daughter-kalpika-1-2025-08-01-11-06-48.jpg)
actress Kalpika ganesh father Police complaint against her daughter Kalpika
సినీనటి కల్పిక గణేష్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆమెపై మరో కేసు నమోదు అయింది. అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే.. ఆమెపై కన్న తండ్రే పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. కల్పికతో తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె తండ్రి గణేష్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కల్పిక మానసిక పరిస్థితి బాగోలేదని.. ఆమె బార్డర్ లైన్ నార్సిస్టిక్ డిసార్డర్‌తో బాధపడుతున్నారని గచ్చిబౌలి పీఎస్‌లో ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Also Read:‘కింగ్డమ్ 2’లో మరొక స్టార్ హీరో.. నిర్మాత నాగవంశీ అఫీషియల్ అప్డేట్
కల్పికపై తండ్రి ఫిర్యాదు
తన కుమార్తె మానసిక సమస్యలతో బాధపడుతోందని, ఆమె వల్ల కుటుంబ సభ్యులకు, బయటివారికి కూడా ప్రమాదం ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన కూతురికి మెంటల్ డిసార్డర్ ఉందని తెలిపారు. ఇప్పటికే ఆమె రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించారని, గతంలో రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. 2023లో మానసిక పరిస్థితి మెరుగుపడేందుకు ఆమె ట్రీట్‌మెంట్ తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆమె మందులు వాడడం మానేయడంతో తరచుగా గొడవలు చేస్తోందని, అందుకే ఆమెను తిరిగి ఆసుపత్రికి పంపించాలని కోరారు. దీంతో పోలీసులు కల్పికపై సెక్షన్ 23 మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు.
ప్రిజం పబ్ సిబ్బందితో వివాదం
కాగా ఈ మధ్య కాలంలో నటి కల్పిక పేరు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న కల్పిక ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, ఇతర వ్యక్తులతోనూ వివాదాలు పెట్టుకుని హాట్ టాపిక్‌గా మారారు. తన వ్యక్తిగత విషయాలను బహిరంగంగా తెలపడం ద్వారా ఆమె సంచలనంగా మారారు.
Also Read:విజయ్ ‘కింగ్డమ్’ మూవీపై రష్మిక రివ్యూ.. ఒక్కమాటతో తేల్చేసిందిగా..
ఈ క్రమంలోనే ఇటీవల ఓ కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. హైదరాబాద్‌లోని ప్రిజమ్ పబ్ వివాదంలో ఆమె గొడవకు దిగడం సంచలన సృష్టించింది. పుట్టినరోజున గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్‌కు వెళ్లిన కల్పిక అక్కడ కేకు విషయంలో పబ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదానికి అసలు కారణం ‘‘కాంప్లిమెంటరీ కేక్’’ అని వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఆమె బయట నుండి కేక్‌ను తీసుకురావడానికి ప్రయత్నించారని.. దానిని ప్రిజం పబ్ సిబ్బంది అంగీకరించకపోవడంతో ఈ గొడవ జరిగిందని సమాచారం. ఈ విషయంలోనే ఇరువురి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. అనంతరం పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో.. కల్పిక బిల్లు చెల్లించకుండా తమతో వాగ్వాదానికి దిగిందని.. తమ సిబ్బందిని అసభ్య పదజాలంతో దుర్భాషలాడిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు కల్పికపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా ఉండటానికి కల్పిక హైకోర్టును ఆశ్రయించి, తాత్కాలిక ఊరట పొందారు.
రిసార్ట్‌లో సిబ్బందితో వివాదం
ఇక పబ్ వివాదంతో వార్తల్లో నిలిచిన సినీనటి కల్పిక.. తాజాగా హైదరాబాద్ శివారులోని ఒక రిసార్ట్‌లో గొడవపడి మరోసారి చర్చనీయాంశమయ్యారు. మొయినాబాద్ -కనకమామిడిలోని బ్రౌన్ టౌన్ రిసార్ట్‌కు వెళ్ళిన ఆమె అక్కడ సిబ్బందితో గొడవకు దిగడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. మెనూ కార్డు, రూమ్ తాళాలను మేనేజర్ ముఖంపై విసిరారని, సిగరెట్లు కావాలని అడుగుతూ దుర్భాషలాడారని రిసార్ట్ సిబ్బంది ఆరోపించారు. దీనిపై కల్పిక క్లారిటీ ఇచ్చారు. తనను సిబ్బంది సరిగా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. క్యాబ్ సౌకర్యం లేదని, వైఫై పనిచేయడం లేదని, సిగరెట్లు అడిగినా తీసుకురాలేదని అందుకే కోపంతో మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనల తర్వాత కల్పిక తండ్రి గణేష్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ వివాదానికి మరింత బలం చేకూర్చింది.