Crime News: జీతం రూ.15 వేలు.. ఆస్తులు 100 కోట్లు... కుప్పలు తెప్పలుగా క్లర్క్ అవినీతి

కర్ణాటకలో కలకప్ప నిడగుండి అనే వ్యక్తి కేఆర్ఐడీఎల్ సంస్థలో చెత్త సేకరించే కార్మికుడిగా ఉద్యోగం చేస్తున్నాడు. అతని ఇంట్లో లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు. కలకప్పకు 24 ఇళ్లు, 40 ఎకరాల వ్యవసాయ భూమి, 5 ఇంటి స్థలాలను స్వాధీనం చేసుకున్నారు.

New Update
Karnataka Crime News

Karnataka Crime News

Crime News: కర్ణాటకలో అవినీతి అధికారులపై లోకాయుక్త కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ గుమాస్తా అవినీతి వ్యవహారం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం నెలకు రూ. 15 వేల జీతం తీసుకునే సాధారణ ఉద్యోగికి ఏకంగా రూ. 100 కోట్ల వరకు అక్రమాస్తులు ఉన్నాయంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఈ భారీ కుంభకోణం కర్ణాటక గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ (KRIDL)లో జరిగినట్లు లోకాయుక్త దాడుల్లో తేలింది. ఇదిలా ఉంటే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న ప్రభుత్వ అధికారులపై దాడులు చేసి కోట్ల విలువైన అక్రమాస్తులను స్వాధీనం చేసుకున్నారు. 

దాడుల్లో అవాక్కైన అధికారులు:

స్థానిక వివరాల ప్రకారం.. 2003లో కలకప్ప నిడగుండి అనే వ్యక్తి కేవలం రూ. 200 నెల జీతంతో కేఆర్ఐడీఎల్ సంస్థలో చెత్త సేకరించే కార్మికుడిగా కాంట్రాక్టు పద్ధతిలో చేరారు. దాదాపు 17 ఏళ్ల సుదీర్ఘ సేవ తర్వాత ఆయన క్లర్క్‌గా పదోన్నతి పొందారు. అయితే.. ఈ పదోన్నతితోపాటు ఆయన అక్రమార్జన పర్వానికి తెరలేపారు. సంస్థలోని కీలక అధికారులతో కుమ్మక్కై భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్లు లోకాయుక్త దర్యాప్తులో వెల్లడైంది. 2023-24 మధ్యకాలంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో ఏకంగా రూ. 72 కోట్ల మేర అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా.. 96 అసంపూర్తి ప్రాజెక్టులకు నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ అక్రమాల్లో కలకప్పతోపాటు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ చిన్‌చోల్కర్ కూడా కీలక పాత్ర పోషించినట్లు తేలడంతో.. 2024లో వీరిద్దరినీ సస్పెండ్ చేశారు. ఆ సమయంలో కలకప్ప నెల జీతం కేవలం రూ.15 వేలు ఉంది.

ఇది కూడా చదవండి: స్కూల్ బస్ ఘోరం.. బైకర్ స్పాట్ డెడ్! తెలంగాణ పోలీస్ వీడియో వైరల్

కలకప్ప నిడగుండి అక్రమాస్తులపై లోకాయుక్తకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో డీఎస్‌పీ వసంత కుమార్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది.  కొప్పల్ జిల్లా కేంద్రంలోని కలకప్ప నివాసం, ఆయన పనిచేసిన కార్యాలయంలో ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఆస్తుల చిట్టా వెలుగులోకి వచ్చింది. అది చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. కలకప్పకు కొప్పల్, భాగ్యనగర్ ప్రాంతాల్లో 24 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. దాంతోపాటు హిట్నల్, హులగి, యెలబుర్గా గ్రామాల్లో 40 ఎకరాల వ్యవసాయ భూమి, 5 ఇంటి స్థలాలను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా రెండు కార్లు, రెండు బైక్‌లు,350 గ్రాముల బంగారం, దాదాపు ఒకటిన్నర కిలోగ్రాముల వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తులు కలకప్ప, ఆయన భార్య, సోదరుడి పేర్లతో ఉన్నట్లు గుర్తించారు. ఇంకా పలు బినామీ పేర్లతో కూడా ఆస్తులు ఉన్నట్లు లోకాయుక్త అధికారులు అనుమానిస్తున్నారు. లెక్కల్లో చూపని ఆస్తుల విలువ దాదాపు రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ అక్రమాస్తులన్నీ ఆయన రూ.15 వేల జీతంతో సంపాదించినవి కావని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: బలవంతంగా ఊపిరి వదిలిన 13ఏళ్ళ బాలిక.. ముక్కలైన శరీర భాగాలు

( Latest News)

Advertisment
తాజా కథనాలు