Model Shanta Pal Arrest: మోడల్, హీరోయిన్ అరెస్ట్.. కోల్‌కతాలో పట్టుకున్న పోలీసులు - ఎందుకంటే?

కోల్‌కతా పోలీసులు బంగ్లాదేశీ మోడల్ శాంతాపాల్‌ను అరెస్టు చేశారు. నకిలీ ఆధార్, ఓటరు కార్డులతో అక్రమంగా భారత్‌లో నివాసం ఉంటున్నారన్న ఆరోపణలపై ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుండి రెండు నకిలీ ఆధార్ కార్డులు, ఓటరు కార్డు స్వాధీనం చేసుకున్నారు.

New Update
bangladeshi model Shanta Pal arrested by kolkata police

bangladeshi model Shanta Pal arrested by kolkata police

భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ మోడల్, నటి శాంత పాల్ (28) అనే యువతిని పశ్చిమ బెంగాల్‌ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఆమె వద్ద రెండు ఫేక్ ఆధార్ కార్డులు, ఓటరు కార్డు, రేషన్ కార్డు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

Model Shanta Pal Arrest

పోలీసుల వివరాల ప్రకారం.. బంగ్లాదేశ్‌లోని బారిసాల్ నివాసి అయిన శాంత పాల్ (28) అనే యువతి అక్కడ నటిగా, అనేక టీవీ ఛానెల్స్, షోలలో యాంకర్‌గా పనిచేసింది. ఆ మహిళ 2024 చివరిలో కోల్‌కతాలోని జాదవ్‌పూర్ ప్రాంతంలో ఒక వ్యక్తితో కలిసి ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకుంది. అయితే ఆమె జాదవ్ పూర్‌లో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. 

Also Read:‘కింగ్డమ్‌ 2’లో మరొక స్టార్ హీరో.. నిర్మాత నాగవంశీ అఫీషియల్ అప్డేట్

దీంతో రంగంలోకి దిగిన వెస్ట్ బెంగాల్ పోలీసులు ఆమె ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ తనిఖీలు చేపట్టగా.. సంచలన విషయాలు బయటపడ్డాయి. నటి శాంత పాల్ పేరు మీద అనేక బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్‌లు, రీజెంట్ ఎయిర్‌వేస్ (బంగ్లాదేశ్) ఉద్యోగి కార్డు, ఢాకాలోని సెకండరీ ఎడ్యుకేషన్ అడ్మిట్ కార్డు, వేర్వేరు అడ్రస్‌లతో నమోదైన రెండు ఆధార్ కార్డులు, ఒక భారతీయ ఓటరు/ఎపిక్ కార్డ్, రేషన్ కార్డు.. ఇలా అన్నీ ఐడీ కార్డులు వేర్వేరు చిరునామాలతో ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. 

ఈ మేరకు కోల్‌కతా పోలీస్ జాయింట్ కమిషనర్ (క్రైమ్) రూపేష్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఆ మహిళ 2024 చివరిలో ఒక వ్యక్తితో కలిసి ఆ ఇంటిని అద్దెకు తీసుకుంది. ఈ క్రమంలో మాకు ఒక ఫిర్యాదు అందింది. మేము కేసును నమోదు చేసాం. దర్యాప్తులో భాగంగా బంగ్లాదేశ్ పౌరురాలు అని తేలింది. ఆ మహిళను అరెస్టు చేసాం. ఆమె ఇప్పుడు పోలీసుల అదుపులో ఉంది. విచారణ సమయంలో పోలీసులకు నటి శాంతా పాల్ సరిగ్గా స్పందించలేదు. భారతదేశంలో ఉండటానికి ఆమె చెల్లుబాటు అయ్యే వీసాను చూపించలేదు. 

Also Read:విజయ్ ‘కింగ్డమ్’ మూవీపై రష్మిక రివ్యూ.. ఒక్కమాటతో తేల్చేసిందిగా..

ఆమె ఆధార్, ఓటరు, రేషన్ కార్డులను ఎలా పొందిందో ప్రస్తుతం ప్రశ్నిస్తున్నాం. ఆమె వద్ద నుండి స్వాధీనం చేసుకున్న రెండు ఆధార్ కార్డులలో ఒకదానికి కోల్‌కతా చిరునామా ఉండగా, మరొకదానికి బర్ద్వాన్ చిరునామా ఉంది. ఆమెకు ఆధార్ కార్డు ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి కోల్‌కతా పోలీసులు ప్రస్తుతం UIDAIతో సంప్రదిస్తున్నారు. అలాగే ఆమెకు ఓటరు కార్డు, రేషన్ కార్డు ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి డిటెక్టివ్‌లు జాతీయ ఎన్నికల సంఘం, పశ్చిమ బెంగాల్ ఆహార శాఖను కూడా సంప్రదిస్తున్నారు.’’ అని తెలిపారు. 

Advertisment
తాజా కథనాలు