falcon invoice : ‘ఫాల్కన్‌’ కు బిగ్ షాక్.. రూ.18 కోట్ల ఆస్తులు జప్తు

ఫాల్కన్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌లతో అమాయకుల నుంచి సంస్థ డిపాజిట్ చేయించుకుని కోట్లు కొల్లగొట్టిన సంగ‌తి తెలిసిందే. దర్యాప్తులో భాగంగా రూ.18.14కోట్ల విలువైన 12స్థిరాస్థులను ఈడీ అటాచ్ చేసింది.

New Update
ED seizes Falcon Group

ED seizes Falcon Group

Falcon scam : ఫాల్కన్ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.మల్లీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్‌లతో అమాయకుల నుంచి సంస్థ డిపాజిట్ చేయించుకుని కోట్లు కొల్లగొట్టిన  ఫాల్కన్ కుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. కాగా క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఈడీ దర్యాప్తులో భాగంగా రూ.18.14కోట్ల విలువైన 12స్థిరాస్థులను ఈడీ అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అమర్‌దీప్ కుమార్ నేతృత్వంలోని మెస్సర్స్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ.792 కోట్లు మోసం చేసినట్లుగా ఈడీ దర్యాప్తులో తేలింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రజలను మోసం చేసినట్లుగా ఈడీ గతంలో అభియోగాలు మోపిన విషయం తెలిసిందే.

Also Read: భారత్‌పై 25 శాతం సుంకాలు.. ఈ ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం


 మెస్సర్‌ క్యాపిటల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో పాటు అమర్‌దీప్‌ కుమార్‌పై ఈడీ అధికారుల గత కొంతకాలంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వందలాది నుంచి పెట్టుబడుల పేరుతో దాదాపు రూ.792 కోట్లు ఈ సంస్థ వసూలు చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో మోసం చేసి సంపాదించిన అక్రమ ఆస్తులను గుర్తించి వాటిని జప్తు చేయాలని ఈడీ నిర్ణయించింది. ఫాల్కన్‌ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అమర్‌దీప్‌ కుమార్‌కు చెందిన హాకర్‌ 800A విమానాన్ని ఇప్పటికే ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంస్థకు చెందిన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  జప్తు చేసింది. రూ.18.14 కోట్ల విలువైన 12 స్థిరాస్తులను అటాచ్ చేసినట్లు శుక్రవారం ఈడీ అధికారులు ప్రకటించారు.

Also Read: 10 నిమిషాల్లో లక్షల కోట్ల నష్టం.. ట్రంప్‌ టారిఫ్‌‌తో కుప్పకూలిన స్టాక్ మార్కెట్!


 కాగా, ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట ఏర్పాటు చేసిన మెస్సర్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు అమర్‌దీప్ కుమార్‌పై ఈడీ అధికారుల దర్యాప్తు చేస్తున్నారు. అధిక లాభాల ఆశ చూపించి 7,056 మంది నుంచి సుమారు రూ. 4,215 కోట్లు వసూలు చేసినట్లు ఫాల్కన్ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. 4065 మంది బాధితులకు రూ.792 కోట్లు చెల్లించకుండా మోసం చేసినట్లు అధికారులు తేల్చారు.మోసపూరితంగా పొందిన నిధులతో నిందితులు అనేక కంపెనీల ఈక్విటీ షేర్లలో పెట్టుబడిగా ఉపయోగించారని తేలింది. కంపెనీలకు రుణాలు, ప్రవైట్ జెట్ విమానం కొనుగోలు, క్యాసినోలలో పెట్టుబడులు పెట్టారని..అమర్‌దీప్ కుమార్, అతని కుటుంబ సభ్యుల పేరిట స్థిరాస్తుల కొనుగోలు చేశారని ఈడీ దర్యాప్తులో గుర్తించింది. ఈడీ అటాచ్ చేసిన స్థిరాస్తులు అమర్‌దీప్ కుమార్, అతని కుటుంబ సభ్యులు, మెస్సర్స్ రెట్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్, మెస్సర్స్ రెట్ హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: సృష్టి కేసులో సంచలనం..సరోగసి చేయకున్న చేసినట్లు నమ్మించాం...డాక్టర్ నమ్రత వాంగ్మూలం

Advertisment
తాజా కథనాలు