Golden Temple: ‘స్వర్ణ దేవాలయాన్ని RDXతో లేపేస్తాం’.. బాంబు బెదిరింపులు కలకలం
పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న స్వర్ణ దేవాలయానికి (హర్మందిర్ సాహిబ్) బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అప్రమత్తమైన స్వర్ణ దేవాలయ నిర్వాహక కమిటీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం కొత్త రాష్ట్ర సైబర్ సెల్, ఏజెన్సీల సహాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.