Srushti Fertility: సృష్టి ఫర్టిలిటీ స్కాంలో 80 మంది శిశువుల విక్రయం.. వెలుగులోకి నమ్రత బాగోతాలు

సృష్టి ఫర్టిలిటీ మోసం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. సరోగసీ పేరుతో నమ్రత అనే వైద్యురాలు భారీ మోసాలకు పాల్పడింది. దంపతుల నుంచి రూ.30-40 లక్షలు వసూలు చేయటంతోపాటు 80 మంది శిశువ వినియోగం చేస్తున్నట్లు తెలుస్తోంది.

New Update
Srushti Fertility Center

Srushti Fertility

Hyderabad: సృష్టి ఫర్టిలిటీ మోసం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. నిస్సంతాన దంపతుల బలహీనతను ఆసరాగా చేసుకుని.. సరోగసీ పేరుతో నమ్రత అనే వైద్యురాలు భారీ మోసాలకు పాల్పడింది. దంపతుల నుంచి రూ.30-40 లక్షలు వసూలు చేసి సరోగసీ ప్రక్రియ పూర్తి చేసి.. నవమాసాల తర్వాత బిడ్డను అప్పగిస్తున్నట్లు నమ్మించింది. అయితే.. ఆమె వాస్తవానికి అక్రమ పిల్లల రవాణా ముఠాల నుంచి శిశువులను కొనుగోలు చేసి వారికి అప్పగించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమె కుమారుడు జయంత్ కృష్ణ కూడా నిందితుడిగా ఉన్నాడు. ఈ దారుణమైన మోసం బయటపడటంతో సృష్టి ఫర్టిలిటీలో పిల్లలను పొందిన దంపతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ పిల్లలు సక్రమమేనా అని వారు భయపడుతున్నారు. ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. తాజాగా 80 మంది శిశువుల విక్రయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వెలుగులోకి నమ్రత మోసాలు..

నిస్సంతాన దంపతుల ఆశలను అడ్డు పెట్టుకుని భారీ మోసాలకు పాల్పడిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు నమ్రత కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసీ పేరుతో సుమారు 80 మంది దంపతులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సరోగసీ ద్వారా పిల్లలు కలిగేలా చేస్తామని నమ్మించి, ఒక్కో దంపతుల నుంచి రూ.30 నుంచి 40 లక్షలు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇంతటితో ఆగకుండా.. అదనపు ఖర్చుల పేరుతో మరిన్ని లక్షలు దండుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నమ్రత, ఆమె కుమారుడు జయంత్ కృష్ణ కలిసి సుమారు రూ.25 కోట్ల వరకు అక్రమంగా సంపాదించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. నమ్రత మోసాల తీరు చూసి దర్యాప్తు అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. 

ఇది కూడా చదవండి: అన్యమతస్థుడితో అక్రమ సంబంధం.. వివాహితను గుండు గీయించి ఊరేగించారు!

సరోగసీ కోసం సేకరించిన వీర్యం, అండాన్ని వాస్తవంగా ఉపయోగించకుండా.. నవ మాసాల తర్వాత అంతర్రాష్ట్ర శిశు అక్రమ రవాణా ముఠాల నుంచి పిల్లలను కొనుగోలు చేసి వారికి అప్పగించినట్లు పోలీసులు నిర్ధారించారు. నవ మాసాలు గర్భం ధరిస్తున్నట్లుగా నమ్మించడానికి.. ఒక మహిళా గైనకాలజిస్టు లెటర్‌ హెడ్‌పై నమ్రత నకిలీ ప్రిస్క్రిప్షన్లు రాసేవారని తేలింది. ఈ విషయం తెలుసుకున్న సదరు గైనకాలజిస్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నమ్రత మోసాలు బయటపడ్డాయి. ప్రస్తుతం నమ్రత, జయంత్‌ల బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్‌ చేశారు. ఈ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో ఉన్న సంబంధాలపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే ప్రధాన ఏజెంట్లను విచారించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ వార్తలు వెలుగులోకి రావడంతో.. సృష్టి క్లినిక్‌లో సరోగసీ ద్వారా సంతానం పొందిన దంపతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు సక్రమమేనా అనే భయం వారిని వెంటాడుతోంది. ఈ కేసు దంపతుల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: పందులు తెచ్చిన పంచాయతీ.. స్పాట్‌లోనే ఐదుగురికి..

Advertisment
తాజా కథనాలు