Shrishti Fertility Center: సృష్టి కేసులో ఈడీ రంగ ప్రవేశం.. భారీగా నిధులు తరలింపుపై అనుమానాలు

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారాలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరుతూ ఈడీ పోలీసులు, సీబీఐ అధికారులకు లేఖ రాసింది.

New Update

Shrishti Fertility Center: సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మనీ లాండరింగ్ వ్యవహారాలు జరిగినట్లు గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగ ప్రవేశం చేసింది. ఈ స్కామ్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరుతూ ఈడీ పోలీసులు, సీబీఐ అధికారులకు లేఖ రాసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత 8 రాష్ట్రాలలో తన కార్యకలాపాలను విస్తరించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఆమె చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడి.. సుమారు 80 మంది పిల్లలను విక్రయించదని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా దాదాపు రూ. 25 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ మొత్తాన్ని ఆమె విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ ఆరోపిస్తోంది.

వంద కోట్లు స్కాం..

ఈ కేసులో పోలీసులు ఇప్పటికే దర్యాప్తు కొనసాగిస్తున్నప్పటికీ.. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు కొత్త మలుపు తిప్పే అవకాశం ఉంది. డాక్టర్ నమ్రత అక్రమంగా సంపాదించిన ఆస్తులు, వాటిని ఎక్కడ పెట్టుబడులు పెట్టారనే అంశాలపై ఈడీ దృష్టి సారించింది. ఈ కేసు విచారణలో నిగ్గు తేలే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సృష్టి స్కాం కేసు దర్యాప్తు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. దీనిపై ఈడీ విచారణ తర్వాత మరిన్ని విషయాలు బయట పడే అవకాశం ఉంది. ఈ కేసులో అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్‌కు పాల్పడ్డ డాక్టర్ నమ్రత అకౌంట్స్‌ని తనిఖీ చేయాలని ఈడీ ప్లాన్ చేస్తుంది. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధమున్న ఇతర వ్యక్తులను కూడా ఈడీ విచారించే అవకాశం ఉందన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఏపీలో విషాదం.. తండ్రికొడుకులతో సహా స్పాట్‌లో మరో వ్యక్తి

సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత సరోగసీ పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు దాదాపు 30 మందిని అరెస్ట్ చేశారు. పేద దంపతులను లక్ష్యంగా చేసుకుని.. వారి నుంచి పిల్లలను కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా సంతానం లేని దంపతులకు అధిక ధరలకు అమ్మి కోట్లు సంపాదించారని దర్యాప్తులో తేలింది. ఈ దందాలో సుమారు 80 మందికి పైగా శిశువులను అక్రమంగా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు నిర్ధారణ కావడంతో ఈడీ రంగంలోకి దిగింది. పలువురు వైద్యులు, ఏజెంట్లు ఈ మోసాల్లో భాగస్వాములుగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రత ఆస్తులను విదేశాల్లో కూడా పెట్టుబడి పెట్టారని పోలీసులు భావించి.. ఈ కేసు దర్యాప్తు మరింత లోతుగా జరుగుతోంది.

ఇది కూడా చదవండి: పుట్టిన శిశువును చంపేసిన తల్లి.. చెత్త బుట్టలో పారేసి పరార్



Advertisment
తాజా కథనాలు