Crime News: మైనర్ బాలికపై హత్యాచారం.. పోక్సో చట్టం కింద నిందితుడికి ఉరిశిక్ష

నల్గొండలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడిన కేసులో పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితుడికి ఉరిశిక్ష విధించింది. దీంతో పాటు రూ.1.10 లక్షల జరిమానా కూడా వేసింది. పదేళ్ల క్రితం జరగ్గా తాజాగా కోర్టు తీర్పునిచ్చింది.

New Update
Court

Court

మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడిన కేసులో పోక్సో కోర్టు ఇన్‌ఛార్జి న్యాయమూర్తి రోజా రమణి నిందితుడికి ఉరిశిక్ష విధించింది. దీంతో పాటు రూ.1.10 లక్షల జరిమానా కూడా వేసింది. నల్గొండలో ఓ 12 ఏళ్ల బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం చూసినిందితుడు మోహమ్మీ ముకఱ్ఱము అత్యాచారం చేశారు. ఆపై ఆమెను చంపేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. దీంతో వన్‌టౌన్‌ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం, హత్యా నేరం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన 10 ఏళ్ల క్రితం జరగ్గా ఇన్ని రోజులు వాదనలు వినిపించగా.. తాజాగా కోర్టు తీర్పునిచ్చింది.

ఇది కూడా చూడండి: Delhi Crime : ఢిల్లీలో మరో దారుణం.. బాత్రూంలో యువతిపై సామూహిక అత్యాచారం!

అనకాపల్లిలో మరో ఘటన..

ఇదిలా ఉండగా గర్భిణిని చంపిన దారుణ ఘటన ఇటీవల చోటుచేసుకుంది. ప్రస్తుతం రోజుల్లో మహిళపై దాడులు అధికంగా జరుగుతున్నాయి. అత్యాచారం చేసి ఆపై చంపేస్తారు. చివరకు గర్భిణి మహిళలు అని కూడా చూడకుండా దారుణానికి పాల్పడ్డారు. అతికిరాతంగా గర్భిణి మహిళను కాల్చివేశారు. ఈ దారుణ ఘటన అనకాపల్లిలో చోటుచేసుకుంది. సబ్బవరం మండలంలోని బంజరి వద్ద గుర్తు తెలియని వాళ్లు గర్భిణిని దారుణంగా చంపేసి, ఆ తర్వాత కాల్చివేసి పడేశారు. ఈ దారుణ ఘటన ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. అయితే ఈ దారుణం తెలిసిన వారే చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆమెకు కాస్త క్లోజ్ ఉన్నవారే ఆమెను చంపి కాల్చి వేసి ఇలా చేసినట్లు ఆనవాళ్లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే ఏ కారణం మీద ఇలా చేశారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి:UP Crime : తూ.. ఏం మనిషివిరా.. రాఖీ కట్టిన చెల్లినే రేప్ చేసి చంపేశాడు!

Advertisment
తాజా కథనాలు