/rtv/media/media_files/2025/08/11/child-on-the-ground-and-hit-him-against-the-wall-2025-08-11-12-41-56.jpg)
child on the ground.. and hit him against the wall.
Noida day care : పట్టణ ప్రాంతాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోగలుతుంది. దీనితో తమ పిల్లలను చూసుకోడానికి ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారికి అప్పగించి వెళ్తుంటారు. అయితే అలా చేయడానికి అవకాశం లేనివారు ఆయాలను నియమించుకోవడం చేస్తుంటారు. ఇవేవీ సాధ్యం కానీ ఉద్యోగాలకు వెళ్లే దంపతులు ఇష్టం లేకపోయినా మరో మార్గంలేక తమ పిల్లలను డే కేర్ సెంటర్‌లలో వదిలి వెళ్తుంటారు. దాని కోసం వారికి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తుంటారు. వారు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు వారికి కావలసిన భోజనం తదితర అవసరాలను తీర్చాల్సి ఉంటుంది. అయితే కొన్ని డే కేర్ సెంటర్ల నిర్వహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా పిల్లల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read : మాస్ జాతర షురూ.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న రవితేజ టీజర్!
చిన్నారులను ప్రేమగా చూసుకోవాల్సిన డే కేర్ సిబ్బంది ఓ పసిపాప పట్ల దారుణంగా వ్యవహరించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్థానిక మీడియా వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన దంపతులు ఇద్దరూ ఉద్యోగస్తులు. దీంతో తమ 15 నెలల పాపను చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో రోజూ స్థానికంగా ఉన్న ఓ డే కేర్ సెంటర్‌లో వదిలి ఉద్యోగాలకు వెళ్లేవారు. సాయంత్రం ఇంటికి తీసుకు వచ్చేవారు. ఇటీవల ఆ చిన్నారిని ఇంటికి తీసుకువచ్చాక దుస్తులు మారుస్తున్న క్రమంలో చిన్నారి శరీరంపై పలు చోట్ల గాయాలు, కొరికిన గుర్తులు ఉన్నట్లు గమనించారు.
అనుమానం వచ్చిన తల్లిదండ్రులు డే కేర్ సెంటర్‌కు వెళ్లి వారిని నిలదీశారు. సిబ్బంది అక్కడి సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. అందులో అక్కడ ఆయాగా పని చేసే యువతి చిన్నారి ఎక్కువగా ఏడుస్తుండంతో అసహనానికి గురై ఏడుస్తున్నా పట్టించుకోకుండా.. కిందపడేసి, గోడకేసి, ప్లాస్టిక్ బ్యాట్‌తో కొడుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో తల్లిదండ్రులు వారిని నిలదీశారు, అయితే ఈ విషయం తెలిసినప్పటికీ యాజమాన్యం తమ తప్పును సరిదిద్దుకునే ప్రయత్న కూడా చేయలేదు. పైగా ప్రశ్నించినందుకు వారిపై దుర్భాషలాడారని ఆరోపిస్తూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వీడియోలో రికార్డైన దృశ్యాలను పోలీసుల ముందుంచారు. ఆ వీడియోల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు డే కేర్ సెంటర్‌లో పని చేసే యువతిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ ఘటనను సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. డే కేర్ సెంటర్లలో పిల్లలను వదిలే తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, వీలయినంత వరకు సొంతవారి వద్ద పిల్లలను వదిలివెళ్లేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. చిన్నారులపై అమానుషంగా ప్రవర్తించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో గోడకూలి ఏడుగురు మృతి, మృతుల్లో ఇద్దరు చిన్నారులు