/rtv/media/media_files/2025/08/12/gattu-vaman-rao-2025-08-12-12-04-32.jpg)
Gattu Vaman Rao
BIG BREAKING: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గట్టు వామన్ రావు హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును తిరిగి విచారణ జరపాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశాలు జారీ చేసింది. వామనరావు, నాగమణి దంపతులు కారులో వెళ్తుండగా అడ్డగించి నడిరోడ్డుపై కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు అదే ఏడాది సెప్టెంబర్ 18న సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
Also Read: అసీఫ్ మునీర్ ఒసామా బిన్ లాడెన్‌లా మాట్లాడారు.. పాక్‌ను ఉగ్ర దేశంగా ప్రకటించాలి.. సంచలన డిమాండ్
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందు ఉంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలో ఆదేశించింది. రికార్డులను పరిశీలించి సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది. చనిపోయే ముందు వామనరావు మాట్లాడిన మరణ వాంగ్మూలం వీడియో వైరల్ అయింది. దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు. వామనరావు మరణ వాంగ్మూలం వీడియో అసలుదేనని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చిందని ఇందుకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
Also Read: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..
అలాగే ఈ కేసు దాఖలు చేసిన పిటిషనర్ కు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ రోజు సుప్రీంకోర్టులో అడ్వకేట్ గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు పై విచారణ జరిగింది. ఈ విచారణలో సుప్రీం కోర్టు తుది తీర్పునిస్తూ తిరిగి విచారణకు ఆదేశించింది.
Also Read:అమెరికాలో 'కూలీ' ఊచకోత! విడుదలకు ముందే అన్ని కోట్ల వసూళ్లు చేసిన తొలి తమిళ్ సినిమా!
పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని గుంజపడుతు గ్రామానికి చెందిన గట్టు వామన్‌రావు, ఆయన భార్య నాగమణి న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. అయితే 17 ఫిబ్రవరి 2021న మంథని నుంచి కారులో హైదరాబాద్‌కు వస్తుండగా పెద్దపల్లికి సమీపంలో వారు ప్రయాణిస్తు్న్న కారును అడ్డుకున్న కొంతమంది వ్యక్తులు వారిని కారులో ఉండగానే నడిరోడ్డుపై హత్య చేశారు. కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని వామన్ రావు తండ్రి కిషన్ రావు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగాఇప్పటికే కేసును సీబీఐ కి అప్పగించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు.
Also Read: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..