TG Crime: ప్రాణాల మీదకు తెచ్చిన ప్రేమ.. వెంటిలేటర్‌పై యువతికి చికిత్స.. పరారీలో లవర్

ఖమ్మం టేకులపల్లికి చెందిన రసూల్‌తో ఓ యువతి ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే.. రసూల్ స్నేహితుడైన సాయితో అఖిల సంబంధం కొనసాగించింది. ఈ విషయం నిలదీయటంతో తీవ్ర మనస్తాపానికి గురైన అఖిల ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

New Update
Tirupati Crime News

khammam Crime News

ప్రేమ అనేది అత్యంత శక్తివంతమైన మరియు సున్నితమైన భావోద్వేగాలలో ఒకటి. అది  మనిషి జీవితాలను సంతోషంతో, ఆశతో నింపుతుంది. అయితే.. కొన్నిసార్లు ఆ ప్రేమ భగ్నమైనప్పుడు లేదా నిరాశ కలిగించినప్పుడు.. దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. కొందరు ప్రేమను తమ జీవితంలో అత్యున్నతమైనదిగా భావిస్తారు. అలాంటి వారు ప్రేమ దూరం అయినప్పుడు.. ఆ బాధను తట్టుకోలేక.. తమ జీవితాన్ని ముగించుకునే ఆలోచనలకు గురవుతుంటారు.  ప్రేమ అంటే ప్రాణం తీసుకోవడం కాదు.. దానిని మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అనుకునే స్థితిలోకి వెళ్లడం చాలా విషాదకరం. ఇది చాలా బాధాకరమైన విషయే అయినప్పటికి కొందరూ ప్రాణాలను తీసుకుంటారు. అలాంటి ఘటన ఒకటి తెలంగాణలో చోటుచేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం..

వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స..

ప్రేమ వ్యవహారం ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. వనస్థలిపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా బావుజీతండాకు చెందిన అఖిల (21) తన సోదరి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు ఖమ్మం టేకులపల్లికి చెందిన రసూల్‌తో ప్రేమ వ్యవహారం నడిచింది. అయితే.. రసూల్ స్నేహితుడైన సాయితో కూడా అఖిల సంబంధం కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న రసూల్ అఖిలను నిలదీశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అఖిల.. తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన రసూల్.. అఖిలను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు.

ఇది కూడా చదవండి: తూ.. ఏం మనిషివిరా.. రాఖీ కట్టిన చెల్లినే రేప్ చేసి చంపేశాడు!

 అయితే ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. అఖిల పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలుసుకున్న రసూల్ ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. మరోవైపు.. అఖిల స్నేహితుడైన సాయి.. కేసు పెడితే బెయిల్ ఇప్పిస్తానని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. అఖిల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. రసూల్ కోసం గాలిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా.. అఖిల మరియు రసూల్ మధ్య జరిగిన కాల్ రికార్డింగ్‌లు కీలకంగా మారనున్నాయి. యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో ఏడు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ప్రేమ వ్యవహారంలో ఆ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: మైనర్ బాలికపై హత్యాచారం.. పోక్సో చట్టం కింద నిందితుడికి ఉరిశిక్ష

Advertisment
తాజా కథనాలు