/rtv/media/media_files/2025/08/14/delhi-crime-news-2025-08-14-14-54-58.jpg)
Delhi Crime News
ఢిల్లీలో భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తాయి. భారీ వర్షం, వరద నీటిలో ఢిల్లీ మునిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకోవడం, ఇళ్లు కూలిపోవడం, రహదారులు మూసుకుపోవడం వంటివి చోటు చేసుకున్నాయి. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద నీటిలో మునిగిపోయి, విద్యుత్ షాక్‌లకు గురై, కూలిపోయిన ఇళ్ల శిథిలాల కింద చిక్కుకొని మరికొందరూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ వర్షాల వల ఆస్తులు, పంట నష్టం భారీగా సంభవిస్తుందని అధికారులు చెబుతున్నారు. సహాయక చర్యలు చేస్తున్నా.. ప్రాణ నష్టం మరింత పెరుగుతున్నాయని అంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో సహాయం కోసం ఎదురుచూసే ప్రజల బాధ వర్ణనాతీతగా ఉంది. తాజాగా దేశ రాజధానిలో వర్షం వల్ల చెట్టు కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తుల ప్రాణాల మీదకు వచ్చింది. దాని వి
చెట్టు కూలి వ్యక్తి దుర్మరణం..
ఢిల్లీలోని కల్కాజీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. కల్‌కాజీ ఏరియాలో గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలుల కారణంగా రోడ్డు పక్కన ఉన్న ఒక పెద్ద చెట్టు బైకు, కారుపై ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఒక వ్యక్తి మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చెట్టును కట్ చేసే లోపు బైక్‌పై ఉన్న వ్యక్తి మృతి చెందాడు. కూలిపోయిన చెట్టు కింద కొంతమంది వ్యక్తులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. స్థానికులు ప్రమాదంపై సమాచారాన్ని పోలీసులు వెంటనే అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మరణించిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.
Tree crashes down in Delhi’s Kalkaji amidst rain-floods, 1 dead, 2 injured. pic.twitter.com/natasqiaZq
— Shiv Aroor (@ShivAroor) August 14, 2025
ఈ ప్రాంతంలో గత కొన్ని గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని.. దీంతో రోడ్లపై నీరు నిలిచిపోయిందని స్థానికులు తెలిపారు. ఈ వర్షాల కారణంగానే చెట్టు బలహీనపడి కూలిపోయి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది. ఢిల్లీలో వర్షాలు కురిసినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇది మొదటిసారి కాదు. పాత, బలహీనమైన చెట్లను గుర్తించి వాటిని తొలగించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. వర్షాల వల్ల కలిగే ప్రమాదాల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో మరో దారుణం.. బాత్రూంలో యువతిపై సామూహిక అత్యాచారం!