State Government: 30 రోజుల్లో రిజర్వేషన్లు.. 60 రోజుల్లో ఎలక్షన్స్.. స్థానిక ఎన్నికలపై సర్కార్ కీలక ప్రకటన!
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా వివిధ వర్గాలకు రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రకటించడానికి 30 రోజుల గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. 30 రోజుల్లో తన బాధ్యతలను నెరవేర్చి రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని చెప్పింది.