/rtv/media/media_files/2025/02/11/UY1uqQNQAOXuoo3uy2uv.webp)
Local Body Elections
Local Body Elections : తెలంగాణలో మరోసారి ఎన్నికల రణరంగం మొదలు కానుంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల స్థానాలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఎన్నికలకు సంబంధించి అంతా సిద్ధంగా ఉండాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి:గుమ్మడికాయ ఏ వ్యక్తులు తినకూడదో తెలుసా..? అది తీవ్రమైన హాని కలిగిస్తుంది
ZPTC And MPTC Seats Finalised
ఎన్నికలకు అవసరమైన మెటీరియల్ ను సిద్ధం చేయాలని కలెక్టర్లకు, జెడ్పిసీఈఓలకు, డీపీఓలకు పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలకు అవసరమయ్యే సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో MPTC, ZPTC స్థానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లా పరిషత్‌లు, 566 జడ్‌పీటీసీ స్థానాలు, 5773 ఎంపీటీసీ స్థానాలు, 566 స్థానాలను ఫైనల్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే గ్రామపంచాయతీ ల సంఖ్య- 12,778గా నిర్ధారించగా వార్డుల సంఖ్య- ఒక లక్ష 12 వేల 694 లుగా తేల్చింది.
Also Read : తెలంగాణ నీటి హక్కులను కేసీఆర్ ఎపీకి ధారదత్తం చేశారు : రేవంత్ సంచలన వ్యాఖ్యలు
సెప్టెంబర్ 30 లోగా తెలంగాణలో స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తీ చేయాలనీ ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఆర్డినెన్స్ ను తయారు చేసిన ప్రభుత్వం దాన్ని ఆమోదం కోసం ఇప్పటికే గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ సంతకం చేసిన అనంతరం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు తెరలేచే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : తెలంగాణలో ఈ నెల 23న స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఎందుకో తెలుసా?
Also Read : తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
BC Reservation In Local Bodies | cm revanth on local body elections | Local Bodie Elections 2025 | local body elections in telangana | MPTC Elections In Telangana | ZPTC Elections In Telangana