BIG BREAKING: డిసెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనోత్సవాల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి.

New Update
BREAKING

BREAKING

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలనోత్సవాల తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఆమోదం తెలిపింది. మొత్తానికి డిసెంబర్‌లో ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. 

Also read: సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం

ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత MPTC, ZPTC ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా రాష్ట్రంలో స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసి 20 నెలలు గడిచిపోయాయి. ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం కూడా తీవ్ర వివాదాస్పదమైంది. తెలంగాణ హైకోర్టు ఈ రిజర్వేషన్లు కేటాయించేందుకు నిరాకరించింది. అనుభవపూర్వక డేటా సేకరించకుండా 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం చెల్లదని స్పష్టం చేసింది.  

Also Read: ఇమ్మడి రవి వద్ద 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా..సంచలన విషయాలు వెల్లడించిన సీపీ సజ్జనార్‌

Advertisment
తాజా కథనాలు