/rtv/media/media_files/2025/03/28/sshA0l7NCucO7Hec1P5s.jpg)
cm revanth reddy 0000 Photograph: (cm revanth reddy 0000)
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ZPTC, MPTC ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు(గురువారం) నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో జూమ్ సమావేశంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల ఇంఛార్జ్ మంత్రులతో సమావేశమైయ్యారు. మొదటి విడత పార్టీ అభ్యర్థు లిస్ట్ ఈరోజు రాత్రికి సిద్ధం కావాలని పార్టీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అభ్యర్థులను ఫైనల్ చేసి భీ ఫారం ఇవ్వాలని చెప్పారు. వివిధ జిల్లాలకు సంబంధించిన ఇంచార్జి మంత్రులు ముఖ్య నాయకులతో సమావేశమై రిజర్వేషన్ల దామాషా ప్రకారం అభ్యర్థులను ఫైనల్ చేయాలని ఆయన సూచించారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. సమన్వయం కోసం గాంధీభవన్‌లో ఓ టీమ్ పెట్టాలని ఆయన కోరారు. అలాగే లీగల్ సెల్2ను యాక్టివ్ చేసి, గాంధీభవన్‌లో లీగల్ టీమ్ అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
ఇంఛార్జ్ మంత్రులు వారి జిల్లాల నాయకులతో అత్యవసరంగా మాట్లాడాలని జూమ్ మీటింగ్ రేవంత్ రెడ్డి చెప్పారు. అభ్యర్థులకు నో డ్యూ సర్టిఫికెట్‌లు ఇప్పించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని పరిస్థితులను ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో జరిగే వాదనలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలి. అప్పటివరకు వాటిపై రాజకీయంగా ఎలాంటి ప్రకటనలు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆదేశించారు.
ZPTC, MPTC రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నేటి(అక్టోబర్ 9) నుంచి అక్టోబర్ 11 వరకు మొదటి దశ నామినేషన్లు స్వీకరించనున్నారు. అలాగే ఈనెల 15 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అక్టోబర్ 23న MPTC, ZPTC మొదటి విడత ఓటింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 11న ఓట్ల లెక్కింపు జరగనుంది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కూడా ఈరోజే సాయంత్రం లోగా వెల్లడించనుంది. నిన్నటి విచారణలో నోటిఫికేషన్‌పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో లోకల్ బాడీ ఎలక్షన్లు ఆసక్తికరంగా మారాయి. ఓ వైపు బీసీ రిజర్వేషన్లపై న్యాయపోరాటం, మరో వైపు ఎన్నికల నిర్వహణ రెండూ కొనసాగుతున్నాయి.