Telangana local body elections : స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం.. 42 శాతం రిజర్వేషన్‌ అమలయ్యేనా?

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. హైకోర్టు గడువులోగా ఎన్నికలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల్లో 42శాతం బీసీ కోటా అమలు ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం తెలుపుతారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.  

New Update
 Local Body Elections

Local Body Elections

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. హైకోర్టు గడువులోగా ఎన్నికలను పూర్తిచేసేందుకు ప్రభుత్వం శరవేగంగా ప్రయత్నాలు చేస్తోంది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఎన్నికల ఏర్పాట్లు చేయాలని పంచాయతీరాజ్‌ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఎన్నికల సామాగ్రిని అందుబాటులో ఉంచుకోవాలని సర్కార్ ఆదేశించింది. మరోవైపు ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటా అమలు ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపింది. పంచాయతీరాజ్‌ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాజ్-Aను సవరించాలని కోరింది. అయితే ఈ ఆర్డినెన్స్‌కి గవర్నర్‌ ఆమోదం తెలుపుతారా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.  

Also Read : అసలు నువ్వు తండ్రేనా.. ఫోన్‌ చూస్తోందని నాలుగేళ్ల కూతురిని గొంతు నులిమి దారుణంగా..!

Telangana Local Body Elections

మరోవైపు  ZPTC, MPTC, సర్పంచ్‌ స్థానాలను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం MPP, ZPTC స్థానాలు 566, MPTC స్థానాలు 5 వేల 773, ZPP స్థానాలు 31 ఉన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు 12 వేల778 గ్రామ పంచాయతీలు.. 1 లక్ష 12 వేల వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఏ క్షణమైనా స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉండటంతో  ప్రభుత్వ వర్గాల్లో హడావుడి మొదలైంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ నెలాకరు కల్లా ఎన్నికలకు సిద్ధమవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. 

Also Read : హైదరాబాద్‌ ప్రజలకు బిగ్ అలర్ట్.. మరో రెండు గంటల్లో కుండపోత వర్షాలు

42 శాతం బీసీ రిజర్వేషన్‌ కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదిస్తేనే చట్టసవరణ అమల్లోకి వస్తుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్.. స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్సు చేస్తుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. ఒకవేళ గవర్నర్‌ ఆర్డినెన్స్‌ను ఆమోదించకపోతే.. పార్టీ పరంగా 42శాతం బీసీ రిజర్వేషన్లు కేటాయించేందుకు కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేస్తోంది.

Also Read :  బీహార్‌లో వింత నాగ పంచమి ఉత్సవం.. విషపు పాములతో ఊరంతా..

Also Read :  Amberpet: మతాంతర వివాహం చేసుకుని..  ఉరేసుకుని నవదంపతులు ఆత్మహత్య

local body elections telangana | local body elections in telangana 2025 | BC Reservation In Local Bodies | cm revanth on local body elections | Local Bodie Elections 2025

Advertisment
Advertisment
తాజా కథనాలు