BIG BREAKING : తమిళనాడు సీఎం ఇంట విషాదం
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె. ముత్తు తుదిశ్వాస విడిచారు. ముత్తు వయసు 77 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పెద్ద కుమారుడు ఎం.కె. ముత్తు తుదిశ్వాస విడిచారు. ముత్తు వయసు 77 ఏళ్లు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
చెన్నై శివారు తిరువళ్లూరు సమీపంలో గూడ్స్ రైలులో అగ్నిప్రమాదం జరిగింది. ఇంధనం లోడుతో వెళ్తున్న రైలులో మంటలు చెలరేగి ఐదు బోగీలకు వ్యాపించాయి. ఈ ఘటనతో చెన్నై సెంట్రల్ నుండి రైలు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినూత డ్రైవర్ హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ హత్య కేసులో మిస్టరీ వీడింది. డ్రైవర్ హత్యకు అసలు కారణం ఏంటో పోలీసులు వెల్లడించారు. రాజకీయ కారణాలతోనే ఈ హత్య జరిగినట్లు నిర్ధారించారు.
తిరువణ్ణామలైలో దారుణం జరిగింది. అరుణాచలేశ్వరస్వామి గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ భక్తుడు దారుణ హత్యకు గురయ్యాడు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకి చెందిన విద్యాసాగర్ (32) తిరువణ్ణామలై వెళ్లారు. అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నాడు.
టాలీవుడ్ నటి త్రిష చెన్నైకి చెందిన పీపుల్ ఫర్ కెటిల్ ఇన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి దేవాలయానికి ఓ ఏనుగును బహూకరించారు. అరుప్పుకోట్టైలోని శ్రీ అష్టలింగ ఆదిశేష సెల్వవినాయకర్ ఆలయానికి వారు ‘గజ’ అనే ఏనుగును దానం చేశారు.
చెన్నై డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈకేసులో శ్రీరామ్ ఇరుక్కున్నాడు. తిరుపతికి చెందిన శ్రీరామ్ ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. రోజూపూలు సినిమాతో తెలుగు, తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీరామ్.
ఓ యువకుడికి ఇటీవలె పెళ్లయింది. సరదాగా భార్యను తీసుకుని కారులో అలా బయటకు వెళ్లాడు. భార్యకు సర్ప్రైజ్ ఇచ్చి ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. తనకున్న రివర్స్ డ్రైవింగ్ టాలెంట్ తో ఆమెను ఉత్సాహ పరుద్దామనుకున్నాడు. రివర్స్ డ్రైవ్ చేసి అడ్డంగా బుక్కైపోయాడు.
డీఎంకే కుటుంబం రోడ్డున పడింది. సోదరుల మధ్యలో తగాదాలు రచ్చకెక్కాయి. సన్ నెట్ వర్క్ కు సంబంధించి దయానిధి మారన్..కళానిధి మారన్ కు లీగల్ నోటీసులు పంపడంతో విషయం అందరికీ తెలిసింది. కళానిధా తనను మోసం చేశారని దయానిధి ఆరోపిస్తున్నారు.
ఇద్దరు బంగ్లా దేశీయులకు చైనా NIA ప్రత్యేక కోర్టు రెండేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది. అక్రమంగా మనుషులను రవాణా చేయడంతో పాటు తప్పుడు పత్రాలతో బ్యాంకు ఖాతాలను దుర్వినియోగం చేస్తున్నారని తేలింది. ఈ క్రమంలో రూ.11 వేలు జరిమానాతో పాటు శిక్ష విధించింది.