Swiggy Instamart: స్విగ్గీలో రూ.లక్ష కండోమ్స్ ఆర్డర్ పెట్టిన కస్టమర్.. ఇంకా చాలా ఉన్నాయ్

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యానివల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నైకి చెందిన ఓ యూజర్ 2025 సంవత్సరంలో మొత్తం 228 సార్లు కండోమ్‌లను ఆర్డర్ చేశారు. ఇందుకోసం అతను ఖర్చు చేసిన మొత్తం అక్షరాలా రూ.1,06,398.

New Update
Swiggy Instamart

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ యానివల్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చెన్నైకి చెందిన ఓ యూజర్ 2025 సంవత్సరంలో మొత్తం 228 సార్లు కండోమ్‌లను ఆర్డర్ చేశారు. ఇందుకోసం అతను ఖర్చు చేసిన మొత్తం అక్షరాలా రూ.1,06,398. లెక్కల ప్రకారం.. అతను దాదాపు ప్రతి ఒకటిన్నర రోజుకు ఒకసారి ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్విగ్గీ తన నివేదికలో ప్రస్తావిస్తూ.. "ముందు జాగ్రత్త పడటంలో ఆ యూజర్ అందరికంటే ముందున్నారు" అంటూ సరదాగా వ్యాఖ్యానించింది.

దేశవ్యాప్తంగా పెరిగిన అమ్మకాలు

కేవలం ఆ ఒక్క వ్యక్తి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా కండోమ్‌ల విక్రయాలు భారీగా పెరిగాయని నివేదిక స్పష్టం చేసింది. ఇన్‌స్టామార్ట్‌లో వచ్చే ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ప్యాకెట్ కావడం విశేషం. ఏడాది పొడవునా ఆర్డర్లు ఉన్నప్పటికీ, సెప్టెంబరు నెలలో కండోమ్ అమ్మకాలు సాధారణం కంటే 24 శాతం ఎక్కువగా నమోదయ్యాయి. చెన్నై వ్యక్తి కండోమ్ ఆర్డర్లే కాకుండా, మరికొన్ని ఆసక్తికరమైన ఆర్డర్లు కూడా చేశాడు.

ఇతర వింత ఆర్డర్లు

హైదరాబాద్ ఐఫోన్లు: హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి ఒకేసారి మూడు iPhone 17 ఫోన్ల కోసం రూ.4.3 లక్షలు ఖర్చు చేశారు.

కరివేపాకు పిచ్చి: కొచ్చికి చెందిన ఒక యూజర్ ఏడాదిలో 368 సార్లు కేవలం కరివేపాకు మాత్రమే ఆర్డర్ చేశారు.

బంగారం అమ్మకాలు: ధంతేరస్ పండగ రోజున బంగారం ఆర్డర్లు గత ఏడాది కంటే 400 శాతం పెరిగాయని స్విగ్గీ తెలిపింది.

భారీ టిప్: బెంగళూరుకు చెందిన ఒక దాతృత్వం కలిగిన యూజర్ ఏడాదిలో డెలివరీ బాయ్స్‌కు ఏకంగా రూ.68,600 టిప్ రూపంలో ఇచ్చారు.

చిన్న చిన్న వస్తువుల కోసం కూడా ప్రజలు ఇప్పుడు బయటకు వెళ్లకుండా క్విక్ కామర్స్ యాప్స్‌పైనే ఆధారపడుతున్నారని ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు