Chennai : ప్యాంట్ జిప్ తీసి ప్రైవేటు పార్ట్ చూపించి.. అసభ్యంగా ప్రవర్తించిన బైకర్‌..  చితకబాదిన పారిశుద్ధ్య కార్మికురాలు!

చెన్నైలో చోటుచేసుకున్న ఓ ఘటన సంచలనం సృష్టించింది. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడికి అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ 50 ఏళ్ల పారిశుద్ధ్య కార్మికురాలు చితకబాదింది.

New Update
sanitation

చెన్నైలో చోటుచేసుకున్న ఓ ఘటన సంచలనం సృష్టించింది. బహిరంగ ప్రదేశంలో అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడికి అక్కడే విధులు నిర్వహిస్తున్న ఓ 50 ఏళ్ల పారిశుద్ధ్య కార్మికురాలు చితకబాదింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు  సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం వేళ విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు వద్దకు ఓ యువకుడు హెల్మెట్ ధరించి బైకుపై వచ్చి ప్యాంట్ జిప్ తీసి ప్రైవేటు పార్ట్ తీసి చూపించే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా షాకైన ఆ  పారిశుద్ధ్య కార్మికురాలు.. వెంటనే ఆ షాకు నుంచి తేరుకుని ఆ కామాంధుడిని చేతిలో ఉన్న చీపురుతో తీవ్రంగా కొట్టింది. వెంటనే అతను అక్కడినుంచి పరారయ్యాడు.

పోలీసులు కేసు నమోదు

 "అతను పిల్లవాడిలా ఉంటాడని నేను అనుకున్నాను, బహుశా కాలేజీ విద్యార్థి కావచ్చు. కానీ నేను దగ్గరికి వెళ్ళినప్పుడు, అతను తన జిప్‌ను తీసేసాడు. నేను షాక్ అయ్యాను, కానీ నేను అతనిని కొట్టడంతో పారిపోయాడని ఆమె చెప్పింది. ఈ సంఘటన కెమెరాలో రికార్డ్ అయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఆధారంగా బైకర్‌ను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి సంఘటనలు గతంలోనూ జరిగాయని మరియు తెల్లవారుజామున పనిచేసే పారిశుధ్య సిబ్బందికి మెరుగైన భద్రత కల్పించాలని అధికారులను కోరారు.

Advertisment
తాజా కథనాలు