Plane Crash: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం క్రాష్

భారత వైమానిక దళానికి చెందిన ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నై శివారు ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదం చెన్నైలోని తాంబరం ఎయిర్‌బేస్‌కు సమీపంలోగల తండలం బైపాస్ ఉపల్లం ప్రాంతంలో జరిగింది.

New Update
Indian Air Force plane crash

భారత వైమానిక దళానికి చెందిన ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ శుక్రవారం మధ్యాహ్నం చెన్నై శివారు ప్రాంతంలో కుప్పకూలింది. ఈ ప్రమాదం చెన్నైలోని తాంబరం ఎయిర్‌బేస్‌కు సమీపంలోగల తండలం బైపాస్ ఉపల్లంలో జరిగింది. ఈ ఘటనలో విమానం నడుపుతున్న పైలట్ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం మధ్యాహ్నం సుమారు 2:50 గంటల ప్రాంతంలో భారత వైమానిక దళానికి చెందిన పిలాటస్ PC-7 Mk II సింగిల్ సీటర్ శిక్షణ విమానం ఒక సాధారణ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ప్రమాదానికి గురైంది. విమానం అదుపు తప్పడాన్ని గమనించిన పైలట్, తక్షణమే చాకచక్యంగా వ్యవహరించి పారాచూట్ సహాయంతో కిందకు దూకారు.

Also Read :  హత్య కేసులో జైలుకెళ్లి ఎన్నికల్లో గెలిచిన JDU నేత

Indian Air Force Plane Crash

విమానం కూలిపోయిన వెంటనే, స్థానికులు, గ్రామస్థులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పైలట్‌కు సహాయం అందించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, పైలట్‌కు తీవ్ర గాయాలు కాలేదు, కానీ ప్రమాదం కారణంగా కొంచెం షాక్‌కు గురయ్యారు. కొద్దిసేపటికే వైమానిక దళానికి చెందిన ఒక హెలికాప్టర్ అక్కడికి చేరుకుని పైలట్‌ను సురక్షితంగా ఎయిర్‌బేస్‌కు తరలించింది. ఈ ప్రమాదంపై భారత వైమానిక దళం ఒక ప్రకటన విడుదల చేసింది. పిలాటస్ PC-7 Mk II విమానం తాంబరం సమీపంలో కూలిపోయిందని, అయితే పైలట్ సురక్షితంగా బయటపడ్డాడని, పౌర ఆస్తులకు ఎటువంటి నష్టం జరగలేదని ధృవీకరించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ కోర్టును ఏర్పాటు చేసినట్లు ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపారు.

Also Read :  బీహార్ సీఎం నితీశ్‌ కుమార్ కాదా ?.. ఎక్స్‌ పోస్టును డిలీట్‌ చేసిన జేడీయూ

Advertisment
తాజా కథనాలు