Crime: అయ్యో పాపం.. బీచ్‌కు వెళ్లి నలుగురు యువతులు మృతి

తమిళనాడులోని ఎన్నూర్ సమీపంలో జరిగిన ఓ విషాద ఘటనలో నలుగురు యువతులు సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. సముద్ర స్నానానికి వెళ్లిన ఈ నలుగురు మహిళలు బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

New Update
washed ashore

తమిళనాడు(tamilnadu)లోని ఎన్నూర్ సమీపంలో జరిగిన ఓ విషాద ఘటనలో నలుగురు యువతులు సముద్రంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు(Girls Washed Up On The Beach). సముద్ర స్నానానికి వెళ్లిన ఈ నలుగురు మహిళలు బలమైన అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ నలుగురు మహిళలు- ఎస్. దేవకి సెల్వమ్ (30), భవాని (19), షాలినీ (17), గాయత్రి (18) లు రోజువారి పనుల తర్వాత ఎన్నూర్‌లోని మెట్టుకుప్పం బీచ్‌కు సరదాగా సముద్ర స్నానానికి వెళ్లారు. వీరిలో దేవకి సెల్వమ్ గుమ్మిడిపూండిలోని శ్రీలంక శరణార్థుల శిబిరంలో నివసిస్తున్నారు. మిగిలిన ముగ్గురు యువతులు స్థానిక వస్త్ర దుకాణాల్లో పనిచేస్తూనే చదువుకుంటున్నారు.

Alo Read :  పెళ్లి పేరుతో గర్భవతిని చేసి మోసం చేసిన ప్రియుడు.. ఇంటిముందు ప్రియురాలి ధర్నా

Girls Washed Up On The Beach

సముద్రంలోకి దిగిన వారిలో ముందుగా షాలినీ లోతుకు వెళ్లి మునిగిపోయింది. ఆమె కేకలు విన్న మిగతా ముగ్గురు మహిళలు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బలమైన సముద్ర అలల తాకిడికి నలుగురూ కొట్టుకుపోయి సముద్రంలో గల్లంతయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయినప్పటికీ, ఈ నలుగురు మహిళలను రక్షించడం సాధ్యం కాలేదు. గంటల తరబడి గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత, వారి మృతదేహాలు సముద్ర అలల తాకిడికి ఒడ్డుకు కొట్టుకొచ్చాయి.

పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కొక్కరిని రక్షించే ప్రయత్నంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. లోతైన ప్రాంతాలకు వెళ్లకూడదని, అజాగ్రత్తగా ఉండకూడదని పోలీసులు పర్యాటకులకు, స్థానికులకు హెచ్చరికలు జారీ చేశారు.

Also Read :  బీబీ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రోడ్డు పక్కన నిలబడిన వారిపైకి దూసుకెళ్లి..

Advertisment
తాజా కథనాలు