Bird Flu: భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. 1500కి పైగా కాకులు మృతి

బర్డ్ ఫ్లూ మళ్లీ వణికిస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఎక్కడికక్కడే కాకులు చనిపోతున్నాయి. ఈ బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌ వల్ల ఏకంగా 1500లకు పైగా కాకులు చనిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

New Update
Bird flu scare in Tamil Nadu as over 1500 crows found dead in Chennai

Bird flu scare in Tamil Nadu as over 1500 crows found dead in Chennai

బర్డ్ ఫ్లూ మళ్లీ వణికిస్తోంది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఎక్కడికక్కడే కాకులు చనిపోతున్నాయి. ఈ బర్డ్‌ ఫ్లూ ఎఫెక్ట్‌ వల్ల ఏకంగా 1500లకు పైగా కాకులు చనిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో కాకులు చనిపోయేటప్పుడు దీన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు. ఎక్కువ సంఖ్యలో ఇవి చనిపోవడంతో ఇది అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో కొన్ని చనిపోయిన కాకుల్ని  మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ' నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్' ల్యాబ్‌‌కి పంపారు.

Also Read: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. అనురాగ్ ఠాకూర్‌పై నిషేధం ఎత్తివేత!

 ఈ కాకుల్నీ పరీక్షించగా వాటిలో అత్యంత ప్రమాదకర ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (H5N1) వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ విషయం తెలుసుకున్న చెన్నై అధికారులు షాక్ అయ్యారు. దీంతో నగరంలో బర్డ్‌ ఫ్లూ వ్యాప్తిపై ఆందోళన మొదలైంది. వాస్తవానికి ఈ ఫ్లూ జనవరిలోనే వచ్చింది. దీని ప్రభావం వల్ల అప్పటినుంచి ఇప్పటిదాకా చెన్నైలోని అనేక ప్రాంతాల్లో 1500లకి పైగా కాకులు చనిపోయాయి. 

బర్డ్‌ ఫ్లూ వ్యాప్తిని అరికట్టేందుకు చెన్నై మెట్రోపాలిటన్ కార్పొరేషన్ (GCC), పశుపాలన శాఖ బృందాలు రంగంలోకి దిగాయి. కాకులు చనిపోయిన ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్, బలమైన డిస్‌ఇన్‌ఫెక్టెంట్లు చల్లుతున్నారు. అంతేకాదు చనిపోయిన పక్షులను 8 నుంచి 10 అడుగుల లోతులో సున్నం వేసి పూడ్చేస్తున్నారు. అలాగే నగరంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పౌల్ట్రీ ఫారాలపై నిఘా పెంచారు. 

Also Read: రూ.8 కోట్ల అవార్డు: ప్రపంచాన్ని మెప్పించిన ముంబై టీచర్!

మరోవైపు డీఎంకే ప్రభుత్వం కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ఇంటి దగ్గర చనిపోయిన పక్షులు కనిపిస్తే చేతులతో తాకొద్దని.. పిల్లలను దూరంగా ఉంచాలని తెలిపింది. పక్షులు చనిపోయినట్లు ఎక్కడైనా కనిపిస్తే మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని పేర్కొంది. పక్షులు ఉండే పార్కులు, బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ను ధరించాలని సూచించింది. చికెన్, గుడ్డు తినేవాళ్లు పూర్తిగా ఉడికించి తినాలని.. మాంసం శుభ్రం చేసేటప్పుడు చేతులకు గ్లవ్స్‌ వాడలని చెప్పింది.

Advertisment
తాజా కథనాలు