Skull: మహిళపై క్షుద్ర పూజలు.. పార్శిల్‌లో మనిషి పుర్రె కలకలం!

చెన్నైలోని ఓ షాపులో పనిచేసే మహిళకు పార్శిల్ వచ్చింది. అనుమానం వచ్చిన షాపు యజమాని అందరి ముందూ ఆ పార్శిల్‌ను తెరిచి చూడటంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. ఆ కవర్‌ను విప్పగానే అందులో మనిషి పుర్రె, ఎముకలు,  విభూది కనిపించాయి.

New Update
chennai

చెన్నై(chennai) లోని ప్యారిస్ ఏరియాలోని ఓ దుకాణంలో వ్యాసర్పాడికి చెందిన శ్రుతి అనే మహిళ పని చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆ షాపు సెక్యూరిటీ గార్డు వద్దకు వచ్చి, శ్రుతి పేరు మీద ఒక పార్శిల్ ఇచ్చి వెళ్ళాడు. సెక్యూరిటీ ఆ కవర్‌ను ఆమెకు ఇవ్వగా, అది తనది కాదని ఆమె తీసుకోలేదు. దీనితో అనుమానం వచ్చిన షాపు యజమాని అందరి ముందూ ఆ పార్శిల్‌ను తెరిచి చూడటంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురయ్యారు. ఆ కవర్‌ను విప్పగానే అందులో మనిషి పుర్రె(human skull), ఎముకలు,  విభూది(bones in parcel) కనిపించాయి. ఏదో క్షుద్ర పూజలు చేసి పంపినట్లుగా ఆ వస్తువులు ఉండటంతో షాపులో ఉన్న వారంతా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Also Read :  చల్లారని కామారెడ్డి చిచ్చు.. బీజేపీ చీఫ్ తో పాటు ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

Woman In Chennai Receives Human Skull

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రుతి కుటుంబానికి, అదే షాపులో పని చేసే దినేష్ కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు గుర్తించారు. శ్రుతిని మానసికంగా కుంగదీసి భయపెట్టడానికే దినేష్ అలా చేశాడని తేలింది. మనిషి ఎముకలతో కూడిన పార్శిల్ పంపి ఆమెను భయాందోళనకు గురిచేయాలని దినేష్ ప్లాన్ చేశాడు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు దినేష్‌తో పాటు, అతనికి సహకరించిన శ్రీనివాసన్, జోసెఫ్ అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యక్తిగత కక్షల కోసం ఇలాంటి అమానుషమైన, వికృతమైన పనులకు పాల్పడటం చెన్నైలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసులు ఆ పుర్రె, ఎముకలు ఎక్కడి నుండి సేకరించారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read :  ఓరెయ్ కామాంధుడా..బెదిరించి అత్యాచారం.. ప్రెగ్నెంట్ చేసి కూడా వదల్లేదు!

Advertisment
తాజా కథనాలు