Bathukamma Celebrations Grandly Celebrated At Hyderabad | ఘనంగా బతుకమ్మ సంబరాలు | RTV
దుబాయ్ లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ & వెల్ఫేర్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో జరుగుతున్న సంబరాలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. RTV మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తోంది.
తెలంగాణ పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. బతుకమ్మను అమెరికా అధికారిక పండుగగా గుర్తించింది. నార్త్ కరోలినా, జార్జియా, చార్లెట్ నగరం, వర్జీనియా రాష్ట్రాల మేయర్, గవర్నర్లు బతుకమ్మను 'తెలంగాణ హెరిటేజ్ వీక్'గా పేర్కొంటూ ప్రకటనలు విడుదల చేశారు.
తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఆర్టీసీ సంస్థకు భారీగా వసూళ్లు వచ్చాయి. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సర్వీసులు నడిపించడం వల్ల ఆదాయం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. దాదాపు 25 కోట్ల రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 13 నుంచి 24 వరకు దాదాపు 11 రోజుల పాటు 5,500 ప్రత్యేక బస్సులు నడిపించడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం వచ్చింది.
సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే... బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండగ ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధాన్ని స్పష్టంగా వివరించి చెబుతుంది. ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండల కంటే పెద్ద పండగ బతుకమ్మ పండగ. స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికితీస్తుంది. తెలంగాణ స్త్రీల గుండె బతుకమ్మ. బతుకమ్మ పండగ గురించి అందరకీ తెలుసు. కానీ బతుకమ్మ కంటే ముందు నిర్వహించే బొడ్డెమ్మ పండగను చేయడం పురాతన కాలం నుంచి వస్తున్న సాంప్రదాయం.