Bathukamma: తెలంగాణ ప్రజలకు పండగే పండుగ.. బతుకమ్మ వేడుకల షెడ్యూల్ ఇదే!

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీగా జరుపుకునే పండగ బతుకమ్మ! ఈ పండగ వచ్చేదంటే పల్లె, పట్టణం, ఊరు, వాడ ఏకమై బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ప్రతి ఇల్లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉంటుంది.

New Update
Bathukamma 2

Bathukamma: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీగా జరుపుకునే పండగ బతుకమ్మ! ఈ పండగ వచ్చేదంటే పల్లె, పట్టణం, ఊరు, వాడ ఏకమై బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ప్రతి ఇల్లు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కళకళలాడుతూ ఉంటుంది. రంగురంగుల పూలు, ఆడపడుచుల నృత్యాలు, పాటలతో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఎంగిలిపూల నుంచి సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజుల పాటు బతుకమ్మను ఒక్కో తీరులో పూజిస్తూ  ఒక్కో రకమైన నైవేద్యం సమర్పిస్తారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది బతుకమ్మ వేడుకలకు చారిత్ర‌క ప్రదేశాలు, ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాలు, వార‌స‌త్వ క‌ట్ట‌డాలు, ప‌ర్యాట‌క ప్రాంతాలు వేదికగా మారనున్నాయి. ఈ ఏడాది  బతుకమ్మ సంబరాలతో పాటు ప్రతీ రోజు ఒక సామజిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బతుకమ్మ సంబరాల పూర్తి షెడ్యూల్ గురించి ఇక్కడ తెలుసుకోండి.. 

బతుకమ్మ పండుగ షెడ్యూల్

మొదటి రోజు (సెప్టెంబర్ 21)

బతుకమ్మ ప్రారంభోత్సవ వేడుక  వేయి స్తంభాల గుడి, వరంగల్ లో జరగుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌,  ప‌ర్యాట‌క శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు,  పంచాయ‌తీ రాజ్ శాఖ మంత్రి సీత‌క్క అన‌సూయ బ‌తుక‌మ్మ అరంభ వేడుక‌లో  పాల్గొన‌నున్నారు. దీంతో పాటు ఉదయం హైదరాబాద్ శివారులో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిచనున్నారు. 

రెండవ రోజు (సెప్టెంబర్ 22): అటుకుల బతుకమ్మ

  • శిల్పరామం ఇన్ హైదరాబాద్  
  • పిల్లలమర్రి ఇన్  మహబూబ్‌నగర్

మూడవ రోజు (సెప్టెంబర్ 23): ముద్ద పప్పు బతుకమ్మ

  • బుద్ధవనం, నాగార్జునసాగర్, నల్గొండ 

నాలుగవ రోజు (సెప్టెంబర్ 24): నాన బియ్యం బతుకమ్మ

  • కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం, భూపాలపల్లి 
  • సిటీ సెంటర్, కరీంనగర్ 

ఐదవ రోజు (సెప్టెంబర్ 25): అట్ల బతుకమ్మ

  • భద్రాచలం ఆలయం- కొత్త‌గూడెం, ఖమ్మం 
  • జోగులాంబ అలంపూర్, గద్వాల
  • స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్ – బతుకమ్మ ఆర్ట్ క్యాంప్ 

ఆరవ రోజు (సెప్టెంబర్ 26): అలిగిన బతుకమ్మ

  • అలీ సాగర్ రిజర్వాయర్, నిజామాబాద్
  •  ఆదిలాబాద్, మెదక్
  • నెక్లెస్ రోడ్, హైదరాబాద్ – సైకిల్ ర్యాలీ (ఉదయం)

ఏడవ రోజు (సెప్టెంబర్ 27): వేపకాయల బతుకమ్మ

  • మహిళల బైక్‌ ర్యాలీ - నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్, హైదరాబాద్ –  (ఉదయం)
  • ఐటి కారిడార్, హైదరాబాద్ – బతుకమ్మ కార్నివల్ (సాయంత్రం)

ఎనిమిదవ రోజు (సెప్టెంబర్ 28): వెన్నముద్దల బతుకమ్మ

  • ఎల్‌బి స్టేడియం, హైదరాబాద్ – గిన్నీస్ వరల్డ్ రికార్డ్ (10,000కిపైగా మహిళలతో 50 అడుగుల బతుకమ్మ)

తొమ్మిదవ రోజు (సెప్టెంబర్ 30): సద్దుల బతుకమ్మ

  • తొమ్మిదవ రోజు  పీపుల్స్ ప్లాజా, హైదరాబాద్ లో బతుకమ్మ ఉత్సవాలు జరగనున్నాయి.  ఈరోజు ఉత్త‌మ బతుకమ్మ పోటీలు, SHG’s మహిళలతో  సరస్ ఫెయిర్ వంటి కళాత్మక పోటీలు నిర్వహించనున్నారు. 
  •  RWA’s  (రెసిడెంట్ వెల్పేర్ అసోసిమేష‌న్స్), Hyderabad Software Enterprises Association: (HYSEA) , హైదరాబాద్ & రంగారెడ్డి ప్రాంతం – బతుకమ్మ కార్యక్రమం, పోటీలు
సెప్టెంబర్ 30న
ట్యాంక్‌బండ్  వద్ద బతుకమ్మ పరేడ్,  హుస్సేన్ సాగర్‌లో 'ఫ్లోటింగ్ బతుకమ్మ' కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. అలాగే సెక్రటేరియట్‌పై 3D మ్యాప్ లేజర్ షో కూడా ఉంటుంది. 
Advertisment
తాజా కథనాలు