/rtv/media/media_files/2025/09/11/medak-2025-09-11-16-36-48.jpg)
Medak
ఏదైనా పండుగ, ఫంక్షన్ వస్తుందటే మహిళలు కొత్త చీరలు కొనడానికి షాపింగ్ మాల్స్‌కు వెళ్తుంటారు. వీటికే షాపింగ్ మాల్స్ మొత్తం నిండిపోతాయి. అందులోనూ తక్కువ ధరకే చీరలు వస్తున్నాయంటే చాలు.. మహిళలు ఎగబడిపోతారు. అలాంటిది బతుకమ్మ సంబురాలు వస్తున్నాయంటే ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బతుకమ్మ స్టార్ట్ అవుతుందంటే నెల రోజుల ముందుగానే షాపింగ్ మాల్స్ అన్ని కూడా మహిళలతో కిక్కరిసిపోతాయి. తెలంగాణ ఆడ బిడ్డలు ఎంతో ఘనంగా జరుపుకునే ఈ బుతకమ్మ కోసం నెల రోజుల ముందు నుంచే మహిళలు షాపింగ్ మాల్స్ వెంబడి తిరుగుతుంటారు.
రూ.99లకే చీర అంటూ ఆఫర్
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 11, 2025
భారీగా ఎగబడ్డ మహిళలు
మెదక్ జిల్లా తూప్రాన్‌లో ఓ షాపింగ్ మాల్ ఆఫర్
మహిళలతో కిక్కిరిసిపోయిన షాపింగ్ మాల్
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు#MedakShoppingMall#99SareeOffer#Telanganapic.twitter.com/84nLvwItmt
ఇది కూడా చూడండి: Ganesh Chaturthi : ఇదెందయ్యా గణపయ్యా...చందా ఇవ్వలేదని.. 4 కుటుంబాలు కుల బహిష్కరణ
ఆఫర్ ఉందని ప్రకటించడంతో..
చీరకు మ్యాచింగ్ గాజులు, బొట్టు బిళ్లలు ఇలా ఎన్నో కొంటుటారు. వీటిలో తక్కువ ధరకు ఏ ప్రాంతంలో దొరుకుతాయని తెలిస్తే మహిళలు అంతా అక్కడికి వెళ్లిపోతారు. అయితే తాజాగా మెదక్‌లో ఓ షాపింగ్ మాల్ పెట్టిన ఆఫర్‌కు మహిళలు భారీగా ఎగబడ్డారు. మెదక్‌లోని తుప్రాన్‌లో ఓ షాపింగ్ మాల్ కేవలం రూ.99 రూపాయలకే చీరలు అని ఆఫర్ ప్రకటించింది. దీంతో చీరలు కొనడానికి మహిళలు భారీగా ఎగబడ్డారు. ఒక్కసారిగా షాపింగ్ మాల్ మొత్తం మహిళలతో కిక్కిరిసిపోయింది. ఆఫర్ విన్న చుట్టుపక్కల గ్రామాల వారు షాపింగ్ మాల్‌కు చేరడానికి నిండిపోయింది. ఒకేసారి ఎక్కువ మంది రావడంతో షాపింగ్ మాల్ లోపల తొక్కిసలాట జరిగేంత పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చూడండి: TG Crime: తెలంగాణలో దారుణం.. మేనత్తను గొడ్డలితో నరికి చంపిన అల్లుడు
జనాలు అధికంగా ఉండటం వల్ల మాల్ బయట కూడా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ గందరగోళం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. జనాన్ని నియంత్రించడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. మాల్‌లోకి ఒకేసారి అందరినీ పంపకుండా, బ్యాచ్‌ల వారీగా పంపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చీరలు ఆఫర్‌లో ఉన్నాయని తెలియడంతో ఎక్కువ మంది షాపింగ్ మాల్‌కు పోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.