BIG BREAKING: గిన్నిస్ రికార్డుల్లోకి తెలంగాణ బతుకమ్మ!

సరూర్‌నగర్‌ మైదానంలోప్రభుత్వం ఏర్పాటు చేసిన 66.5 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మ వద్ద మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం పదివేల మందికి పైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనగా 1354 మంది మహిళలతో ఒకేసారి బతుకమ్మ ఆడించి.. గిన్నిస్‌ రికార్డు సాధించారు.

New Update
Telangana Bathukamma enters Guinness World Records!

Telangana Bathukamma enters Guinness World Records!

BIG BREAKING: సరూర్‌నగర్‌ మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. స్టేడియంలో  ప్రభుత్వం ఏర్పాటు చేసిన 66.5 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మ వద్ద మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మొత్తం పదివేల మందికి పైగా మహిళలు ఈ వేడుకల్లో పాల్గొనగా 1354 మంది మహిళలతో ఒకేసారి బతుకమ్మ ఆడించి.. గిన్నిస్‌ రికార్డు సాధించారు. సంప్రదాయ దుస్తుల్లో మహిళలు బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా ఆడి పాడారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలతో కలిసి ఆటపాటలతో అలరించారు. బతుకమ్మ చుట్టూ నిల్చొని పాటలు పాడారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరి ఆకట్టుకుంది. ఈ సందర్భంగా  అతిపెద్ద జానపద నృత్యంగా, అతిపెద్ద బతుకమ్మగా రెండు గిన్నీస్‌ రికార్డులు సృష్టించింది.

స్టేడియంలో ఒకేసారి 1354 మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు.  

కాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళలకు సద్దుల బతుకమ్మ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని, పూలను పూజించే గొప్ప సంస్కృతికి తెలంగాణ నెలవు అని ఆయన పేర్కొన్నారు. కష్టసుఖాలను పంచుకునే ప్రజల ఐక్యతకు ఈ పండగ నిదర్శనమని తెలిపారు. ప్రకృతి పరిరక్షణకు ప్రజాప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఈసందర్భంగా రేవంత్‌ రెడ్డి తెలిపారు. 

Also Read :  దారులన్నీ ఊరివైపే... బతుకమ్మ..దసరా రద్దీ.. కిక్కిరిసిన బస్టాండ్లు.. రైల్వే స్టేషన్లు

Advertisment
తాజా కథనాలు