KCR‌కు బిగ్ షాక్.. కవితకు చింతమడక గ్రామస్తుల ఆహ్వానం

కవితకు ఆమె తండ్రి KCR సొంత ఊరు నుంచి ఆహ్వానం వచ్చింది. చింతమడకలో సెప్టెంబర్ 21న జరిగే ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని ఆ గ్రామస్తులు గురువారం ఆమెను ఆహ్వానించారు. జాగృతి కార్యాలయానికి గురువారం చింతమడక గ్రామస్తులు పెద్దసంఖ్యలో వచ్చి కవితలో భేటీ అయ్యారు.

New Update
kavitha

కవితకు ఆమె తండ్రి KCR సొంత ఊరు నుంచి ఆహ్వానం వచ్చింది. చింతమడకలో సెప్టెంబర్ 21న జరిగే ఎంగిలిపూల బతుకమ్మకు రావాలని ఆ గ్రామస్తులు గురువారం ఆమెను ఆహ్వానించారు. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయానికి గురువారం చింతమడక గ్రామస్తులు పెద్దసంఖ్యలో వచ్చి కవితలో భేటీ అయ్యారు. గ్రామంలో జరిగే బతుకమ్మ సంబరాలకు హాజరుకావాలని పిలిచారు. 

బతుకమ్మకు నా సొంత ఊరుకు పిలవడం చాలా సంతోషంగా ఉందని కవిత ఆనందం వ్యక్తం చేశారు. గొప్ప ఉద్యమకారుడిని కన్న గొప్ప ఊరు మా చింతమడక అంటూ.. ఆమె చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఆమె చింతమడక నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాయని అన్నారు. చింతమడకలో బతుకమ్మ ఆడిన రోజులు ఇంకా కండ్ల ముందే ఉన్నాయని ఆమె అన్నారు. ఈ సమయంలో మీరంతా వచ్చి తనకు ధైర్యం ఇచ్చారని కవిత అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఆమె సొంత పార్టీలో కీలక నాయకులపై అవినీతి ఆరోపనణలు చేశారు. దీంతో పార్టీ ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. తర్వాత కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో కవితకు కేసీఆర్ సొంతగ్రామం చింతమడక నుంచి ఆహ్వానం రావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో కొందరు రాజకీయ విశ్లేషకులు కవిత తండ్రి సొంత్ర గ్రామం నుంచి రాజకీయ పున:ప్రారంభం చేస్తున్నారని అభిప్రాయ పడుతున్నారు. 

తెలంగాణ ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకునేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిద్ధమయ్యారు.

Advertisment
తాజా కథనాలు