BLA: బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి బిగ్ షాక్.. ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా
అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు దాని అనుబంధ సంస్థ అయిన 'ది మజీద్ బ్రిగేడ్'ను కూడా ఈ జాబితాలో చేర్చింది.