చైనా, పాకిస్థాన్‌‌లకు షాక్.. UNలో బలుచిస్తాన్‌కు అండగా అమెరికా, బ్రిటన్

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్, చైనాలకు ఎదురుదెబ్బ తగిలింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), దాని అనుబంధ సంస్థ మజీద్ బ్రిగేడ్‌లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించేందుకు ఆ రెండు దేశాలు చేసిన ప్రయత్నాన్ని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి.

New Update
Balochistan at UN

ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్, చైనాలకు ఎదురుదెబ్బ తగిలింది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA), దాని అనుబంధ సంస్థ మజీద్ బ్రిగేడ్‌లను ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించేందుకు ఆ రెండు దేశాలు చేసిన ప్రయత్నాన్ని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అడ్డుకున్నాయి. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి 1267 ఉగ్రవాద ఆంక్షల కమిటీలో ఆయా దేశాలు టెక్నికల్  విధించాయి.

పాకిస్థాన్‌లో చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC) ప్రాజెక్టులపై తరచుగా దాడులు చేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA)ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని చైనా, పాకిస్థాన్‌లు చాలా కాలంగా కోరుతున్నాయి. బలూచిస్తాన్‌లోని తమ వనరులను పాకిస్థాన్ దోచుకుంటోందని, చైనా ప్రాజెక్టుల వల్ల తమ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని BLA ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఆ సంస్థ చైనా జాతీయులు, పాకిస్థాన్ సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది.

ఈ దాడుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని 1267 కమిటీలో BLA, మజీద్ బ్రిగేడ్‌లను ఉగ్రవాద సంస్థలుగా చేర్చాలని పాకిస్థాన్, చైనా ఒక ఉమ్మడి తీర్మానాన్ని ప్రతిపాదించాయి. అయితే, అల్-ఖైదా, ఐసిస్ వంటి సంస్థలకు సంబంధించిన గ్రూపులను మాత్రమే 1267 కమిటీ ఉగ్రవాద జాబితాలో చేరుస్తుందని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ పేర్కొన్నాయి. BLA వంటి వేర్పాటువాద సంస్థలను ఈ జాబితాలో చేర్చడానికి తగిన ఆధారాలు లేవని ఆ దేశాలు వాదించాయి.

పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులను ఐక్యరాజ్యసమితిలో ఉగ్రవాదులుగా ప్రకటించాలంటూ గతంలో భారత్ చేసిన ప్రతిపాదనలను చైనా అడ్డుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్, చైనాలు చేసిన ప్రతిపాదనను అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అడ్డుకోవడం గమనార్హం. ఈ పరిణామం పాకిస్థాన్, చైనాలకు ఒక పెద్ద దౌత్యపరమైన ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు. ఈ సాంకేతిక అడ్డంకి కారణంగా ఈ ప్రతిపాదన కనీసం ఆరు నెలల పాటు నిలిచిపోనుంది. ఈ కాలంలో ఈ మూడు దేశాలు ఈ విషయంపై మరింత సమాచారం సేకరిస్తాయి. ఈ నిర్ణయం పాకిస్థాన్‌కు తీవ్ర నిరాశ కలిగించగా, బలూచిస్తాన్ వేర్పాటువాదులకు తాత్కాలిక ఊరటనిచ్చింది.

Advertisment
తాజా కథనాలు