/rtv/media/media_files/2025/10/01/pakistan-escalates-military-crackdown-in-zehri-2025-10-01-13-56-06.jpg)
Pakistan escalates military crackdown in Zehri
పాకిస్థాన్ సైన్యం(pakistan-army) రోజురోజుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ(balochistan liberation army) (BLA), బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) టార్గెట్‌గా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే బలూచిస్థాన్‌లో సొంత ప్రజల పైనే డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు పాల్పడుతోంది. దీంతో కుజ్దార్ జిల్లాలోని జెహ్రీ ప్రాంతానికి చెందిన స్థానికులు భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు దాడి జరుగుతుందో తెలియకా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత నాలుగు రోజులుగా పాక్ సైన్యం ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: ఆ కంపెనీ ఉద్యోగులకు బిగ్ షాక్.. బలవంతంగా రిజైన్.. ఒక్కసారిగా 80 వేల మందిపై వేటు!
Pakistan Escalates Military Crackdown In Zehri
దీంతో బలూచిస్థాన్‌లోని ఆయా ప్రాంతాల్లో లాక్‌డౌన్ పరిస్థితులు తలెత్తాయి. ప్రజలు ఇళ్లనుంచి బయటకి రావడం లేదు. దీంతో వాళ్లకి ఆహారం, ఇంధనం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. పాక్ సైన్యం చేస్తున్న వరుస బాంబు దాడుల వల్ల పత్తి పొలాలు ధ్వంసమైపోయాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోయామని అక్కడి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఛశ్మా అనే ప్రాంతంలో మిసైల్స్, మోర్టార్ల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Also Read: ఇది కదా అసలైన పండుగంటే.. అక్టోబర్‌లో ఏకంగా 19 రోజులు బ్యాంకులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే?
అంతేకాదు అక్కడ ఇంటర్నెట్ సేవలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం బీఎల్‌ఏ, బీఎల్‌ఎఫ్ ఆధీనంలో జెహ్రీ ప్రాంతం ఉంది. దాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాక్ సైన్యం ఈ దాడులు చేస్తోంది. ఇదిలాఉండగా ఇటీవల కూడా పాక్ సొంత ప్రజలపైనే బాంబులతో దాడులు చేయడం కలకలం రేపింది. సెప్టెంబర్‌లో ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని మాత్రె దారా అనే గ్రామంలో ఫైటర్ జెట్‌లు, ఇతర బాంబులతో దాడులు చేసింది. ఈ ప్రమాదంలో దాదాపు పదుల సంఖ్యలో పాక్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: ఫిలిప్పీన్స్ లో పెరుగుతున్న భూకంపం డెత్ టోల్..31 చేరుకున్న మృతుల సంఖ్య
మరోవైపు పాకిస్థాన్‌లో ఉగ్రదాడులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. బలూచిస్థాన్‌లోనే అత్యధికంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలో ప్రావిన్స్‌లో ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్‌ను అణిచివేసే లక్ష్యంగా పాక్ సైన్యం దాడులకు దిగింది. ఇందులో భాగంగా సొంత ప్రజలపై కూడా దాడులు జరగడం కలకలం రేపుతోంది.
Also Read: కరూర్ తొక్కిసలాటలో సంచలన విషయాలు.. పగిలిన మృతుల ఊపిరితిత్తులు