/rtv/media/media_files/2025/08/12/us-declares-balochistan-liberation-army-and-majeed-brigade-as-terror-groups-2025-08-12-12-19-54.jpg)
US declares Balochistan Liberation Army and Majeed Brigade as terror groups
ప్రస్తుతం పాకిస్థాన్‌కు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. తమకు స్వాతంత్య్రం కావాలని గత కొన్నేళ్లుగా పాక్‌లో దాడులు చేస్తున్నారు. ఇటీవల కూడా బీఎల్ఏ.. ట్రైన్ హైజక్ చేయడం, కాల్పులు జరగపడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీని విదేశీ ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు దాని అనుబంధ సంస్థ అయిన 'ది మజీద్ బ్రిగేడ్'ను కూడా ఈ జాబితాలో చేర్చింది.
Also Read: అమెరికాలో అల్లకల్లోలం.. రాజధానిలో భారీగా మోహరించిన నేషనల్ గార్డ్స్.. అసలేం జరుగుతోంది?
ఇటీవల పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన బలూచిస్థా్న్ లిబరేషన్ ఆర్మీపై ప్రపంచ స్థాయిలో కఠినంగా చర్యలు తీసుకోవాలని అమెరికాకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే అమెరికా.. బీఏఎల్‌ను విదేశీ ఉగ్రసంస్థగా అధికారికంగా ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరాటం చేసేందుకు తాము తీసుకున్న ఈ నిర్ణయం నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రకటించారు.
2019లో కూడా బీఎల్‌ఏను "స్పెషల్లీ డిజిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రరిస్ట్" (SDGT) జాబితాలో మొదటిసారిగా చేర్చారని చెప్పారు. ఆ తర్వాత దాని అనుబంధ సంస్థ మజీద్ బ్రిగేడ్ కూడా అనేక దాడులకు బాధ్యత వహించినట్లు పేర్కొన్నారు. అమెరికా విదేశాంగ తెలిపిన వివరాల ప్రకారం.. 2024లో కరాచీ ఎయిర్‌పోర్ట్, గ్వాదర్ పోర్ట్ అథారిటీ కాంప్లెక్స్ సమీపంలో బీఎల్‌ఏ ఆత్మహుతి దాడికి పాల్పడింది.
Also Read: జెలెన్‌స్కీకి ప్రధాని మోదీ ఫోన్.. యుద్ధంపై కీలక అంశాలు చర్చ
ఈ ఏడాది మార్చిలో క్వెట్టా నుంచి పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసింది. 31 మందిని చంపేసి.. 300 మందికి పైగా ప్రయాణికులను బందీలుగా తీసుకుంది. ఉగ్రవాదులపై ఆంక్షలు విధించడం, వాళ్ల ఆర్థిక, నెట్‌వర్క్‌ను అంతే చేసేందుకు ఈ నిర్ణయం సరైన మార్గమని మార్కో రూబియో అన్నారు.
మరోవైపు పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో గత కొన్ని శతాబ్దాలుగా బీఎల్‌ఏ వేర్వాటువాద ఉద్యమం చేస్తోంది. పాక్ ప్రభుత్వం తమ ప్రాంతంలోని ఖనిజ వనరులను దోపిడి చేస్తోందని, స్థానిక బలూచ్ సమాజంపై వివక్ష చూపిస్తోందని ఆరోపణలు చేస్తోంది. ఈ క్రమంలోనే తమకు స్వాతంత్ర్య్ం కావాలని పాక్ ప్రభుత్వంతో పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగానే పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే పాకిస్థాన్ బీఎల్‌ఏను ఉగ్రసంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా అమెరికా కూడా బీఎల్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్థాన్ ప్రభుత్వం అమెరికా నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు బీఎల్‌ఏ వేర్పాటువాదులు అమెరికా నిర్ణయంపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు.
Also Read: హెచ్ 1 బీ భారత వీసాదారులకు మరో షాక్...గ్రీన్ కార్డ్ ఇక మీ పిల్లలకు పని చేయదు..