/rtv/media/media_files/2026/02/01/over-140-militants-killed-after-multiple-suicide-and-gun-attacks-in-balochistan-2026-02-01-18-56-37.jpg)
Over 140 militants killed after multiple suicide and gun attacks in Balochistan
బలూచిస్తాన్‌లో దాడులు చేస్తున్న మిలిటెంట్లపై పాకిస్థాన్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన ఆపరేషన్‌లో 145 మంది బలూచిస్థాన్ మిలిటెంట్లను హతమార్చింది. ఈ విషయాన్ని పాక్ మిలిటరీ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడిలో సెక్యూరిటీ సిబ్బందితో పాటు సాధారణ పౌరులు మృతి చెందినట్లు పేర్కొంది. ఈ దాడులు తామే చేస్తున్నామని గతంలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించిన సంగతి తెలిసిందే. బలూచిస్తాన్‌లో రెబల్స్, మిలిటరీ మధ్య ఫైరింగ్ నడుస్తోంది.
Also Read: రష్యా వద్దు వెనెజువెలా ముద్దు.. ముడి చమురుపై ట్రంప్ ఆఫర్
బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టాతో సహా పలు నగరాల్లో జరుగుతున్న దాడులకు BLA మిలిటెంట్లు కారణమని పాక్ మిలిటరీ ఆరోపించింది. బలూచిస్తాన్ సరిహద్దు సమీపంలో క్లియరెన్స్ ఆపరేషన్ చేపట్టామని పేర్కొంది. రెబల్స్ ప్లాన్‌ను దెబ్బతీసినట్లు చెప్పింది. క్వెట్టాలో ఇప్పటికే పలు బిల్డింగ్‌లు, రోడ్లను కూడా సీజ్ చేశారు.
Also Read: బడ్జెట్‌పై విపక్షాల మండిపాటు.. ఎవరేమన్నారంటే?
మొబైల్ ఫోన్ సర్వీసులు ఆపేశారు. ఈ ఆపరేషన్ చేస్తున్న సమయంలో రైళ్ల రాకపోకలు సైతం నిలిపివేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు తమ పోరాటం ఆగదని పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు BLA దాడులకు భారత్ కూడా సపోర్ట్ చేస్తోందని గతంలో పాక్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
Follow Us