Pakistan: పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తున్న BLA.. అయిదుగురు సైనికులు హతం
పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా జమురాన్, క్వెట్టాలో పాక్ ఆర్మీ కాన్వయ్పై దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు హతమయ్యారు.
పాకిస్థాన్‌కు బలోచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) బిగ్ షాక్ ఇచ్చింది. తాజాగా జమురాన్, క్వెట్టాలో పాక్ ఆర్మీ కాన్వయ్పై దాడులు చేసింది. ఈ దాడిలో ఐదుగురు సైనికులు హతమయ్యారు.
పాకిస్తాన్‌తో విడిపోయి ప్రత్యేక దేశంగా మారాలనుకుంటున్న బలూచిస్తాన్ తిరుగుబాటు దళం BLAలో మహిళలు కూడా ఉన్నారు. బలూచ్ తెగలో అందమైన అమ్మాయిలు ఎక్కువ. పాక్ సైన్యం వారిపై చేసే అఘాయిత్యాలు తట్టుకోలేక వారు కూడా ఉద్యమంలోకి వెళ్లి సూసైడ్ బాంబర్లుగా మారుతున్నారు.
మొదట ఇష్టం లేకున్నా తర్వాత 1948 మార్చి 27 బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ దేశంలో కలుపుకున్నారు. అప్పటి నుంచి బలూచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉండాలని పోరాడుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న ఖనిజ నిక్షేపాలు దోపిడి గురవుతున్నాయని బలూచ్ తెగ ఉద్యమించింది.
ఒకవైపు బారత్ దాడితో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్థాన్‌కు బలూచ్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ చేతుల్లో నుంచి బలూచిస్తాన్ జారిపోతోంది. BLA వరుస దాడులతో పాక్ ఆర్మీ బెంబేలెత్తిపోతోంది. BLA పాక్ పై బాంబుల వర్షం కురిపిస్తోంది.
బలూచిస్తాన్‌లోని బోలాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ పేలుడులో ఒక అధికారి సహా ఆరుగురు సైనికులు మృతి చెందారు. మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఆర్మీ వాహనం సాధారణ గస్తీలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది.