AP: ఆంధ్రాలో ఉగాది నుంచి ఫ్రీ బస్సు!
సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిచనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు.
సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చేందుకు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిచనున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు.
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రజలు భారీగా వెళ్తుంటారు. ఈ క్రమంలో తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనంగా 5 వేల ప్రత్యేక బస్సులను ఏపీకి నడపనున్నట్లు తెలిపింది. పది రోజుల పాటు ఈ బస్సులు నడపనున్నారు.
ఏపీ ఆర్టీసీ అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ పథకం అమలు చేస్తే రోజుకు సగటున 10 లక్షల మంది వరకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. అదనంగా 2వేల బస్సులు, 11,500 మంది సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు.
రైతులకు ఫ్రీ-బస్ స్కీమ్ అమలుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఈ స్కీమ్ కు సంబంధించి విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘంను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఏసీ బస్సుల్లో 20శాతం రాయితీని ప్రకటించింది.విజయవాడ నుంచి హైదరాబాద్, విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే బస్సుల్లో 20శాతం, 10శాతం ఆయా బస్సుల్ని బట్టి రాయితీని ప్రకటించారు.
ఏపీ ఆర్టీసీ బస్సులో దారుణం జరిగింది. తిరుపతి- శ్రీకాళహస్తి మార్గంలో వెళ్లే బస్సులో ఓ యువకుడు ఉరేసుకుని చనిపోవడం సంచలనం రేపుతోంది. రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సివుంది.
ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. బస్సుల్లో ప్రయాణించే సీనియర్ సిటిజన్లకు 25 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 60 ఏళ్లు పైబడిన వారు రేషన్, ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, పాస్పోర్ట్, సీనియర్ సిటిజన్ ఐడీలు చూపించి ఈ ఆఫర్ పొందొచ్చు.
ఏపీ దసరా సెలవుల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఓ శుభవార్త చెప్పింది. ఇతర జిల్లాలు, తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణీకుల కోసం 6,100 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు తాజాగా ఓ ప్రకటన చేసింది.
నేషనల్ హైవే పై 44 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు పూర్తిగా దగ్ధమైంది.జడ్చర్ల బురెడ్డిపల్లి సమీపంలో ఆదివారం అర్ధరాత్రి 1:45 గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది.