మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త.. ఫ్రీ బస్ స్కీంపై కీలక నిర్ణయం!

రైతులకు ఫ్రీ-బస్ స్కీమ్ అమలుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఈ స్కీమ్ కు సంబంధించి విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘంను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 

New Update
AP Free Bus Scheme

రైతులకు ఫ్రీ-బస్ స్కీమ్ అమలుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమైంది. ఈ స్కీమ్ కు సంబంధించి విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘంను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ చైర్మన్ గా ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ మండిపల్లి‌న రాంప్రసాద్ రెడ్డి ని ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, హోం మినిస్టర్ అనితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించనుంది. అక్కడ స్కీమ్ అమలు తీరు పరిశీలించి సలహాలు, సూచనలు చేయనుంది. సాధ్యమైనంత త్వరగా ఈ కమిటీ ప్రభుత్వానికి తన రిపోర్ట్ ను అందజేయనుంది. రిపోర్ట్ తర్వాత ప్రభుత్వం స్కీమ్ ను అమలు చేయనుంది. 

అయితే.. మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలుపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కాలయాపన తప్పా ఇచ్చిన హామీ నిలబెట్టుకునే బాధ్యత కనిపించడం లేదని విమర్శించారు. అధికారం చేపట్టిన 6 నెలల్లో పండుగలు, పబ్బాలు పేరు చెప్పి దాటవేశారని ఫైర్ అయ్యారు. బస్సులు కొంటున్నాం అని చెప్పుకొచ్చారని ధ్వజమెత్తారు. ఇప్పుడు మంత్రివర్గ ఉప సంఘం పేరుతో మరికొన్ని రోజులు సాగతీతకు సిద్ధమయ్యారని నిప్పులు చెరిగారు. ఈ మేరకు షర్మిల ట్వీట్ చేశారు. 

Also Read: రాష్ట్రంలో మరోసారి భారీ భూకంపం!

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు