ఏపీలో ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ పండుగ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా కూడా తప్పకుండా ఈ పండుగకి ఇంటికి చేరుకుంటారు. ఏపీ ప్రజలు చాలా మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నివసించే వారు తప్పకుండా సంక్రాంతికి ఇంటికి వెళ్తారు.
ఇది కూడా చూడండి: యువతకి కిక్కు ఇస్తున్న.. మ్యాడ్ స్క్వేర్ స్వాతి రెడ్డి సాంగ్
సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని..
బస్సులు, కార్లు, రైళ్లు ఏదో విధంగా అయిన కూడా పండగకి వెళ్లాలని అనుకుంటారు. సంక్రాంతి సమయంలో ఏ వాహనం కూడా ఖాళీ ఉండదు. దీంతో సొంతూళ్లకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేకంగా 5 వేల బస్సులను ఏపీకి నడపనున్నట్లు తెలిపింది.
ఇది కూడా చూడండి: Weather: రుతుపవనాల సీజన్ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!
జనవరి మొదటి వారం నుంచి పది రోజుల పాటు ఏపీకి ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అయితే ఈ 5 వేల బస్సులు ఏయే రూట్లలో నడుస్తాయనే విషయాలు ఇంకా తెలియాలి. అలాగే బస్సు ఛార్జీలు పెంచుతున్నారా? లేకపోతే యథావిధిగానే ఉంటాయనే విషయాలు కూడా ఇంకా ఆర్టీసీ వెల్లడించలేదు.
ఇది కూడా చూడండి: AP: పవన్ కల్యాణ్ పర్యటనలో నకిలీ సెక్యూరిటీ సూర్యప్రకాష్ కథ ఇదే..
హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే వారి కోసం ఏపీఎస్ ఆర్టీసీ కూడా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయనుంది. 2400 బస్సులను ప్రత్యేకంగా నడపనున్నారు. పండగ సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఏపీఎస్ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక బస్సులను జనవరి 9 నుంచి 13 వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయని ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది.
ఇది కూడా చూడండి: ISRO: మరో కొత్త ప్రయోగంతో ఇస్రో రెడీ..రేపు PSLV-C60 కౌంట్‌డౌన్