Supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిందే

అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ 2009 లో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఏపీలో మృతిచెందింది.ఆ కుటుంబానికి ఏపీఎస్‌ఆర్టీసీ 9 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

New Update
Supreme Court

Supreme Court

Supreme Court: అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఓ మహిళ 2009 లో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఏపీలో మృతిచెందింది.ఆ కుటుంబానికి ఏపీఎస్‌ఆర్టీసీ 9 కోట్ల రూపాయలను పరిహారంగా చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రలతో కూడిన ధర్మాసనం తీరుప్ఉని వెలువరించింది.

Also Read: Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

కేసు వివరాలు ఇలా ఉన్నాయి...లక్ష్మి నాగళ్ల అనే మహిళ 2009 జూన్‌ 13న భర్త,ఇద్దరు కూతుళ్లతో కలిసి కారులో అన్నవరం నుంచి రాజమహేంద్రవరానికి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు.

Also Read: Tirupati laddu: తిరుమల లడ్డూపై చంద్రబాబు అసత్య ప్రచారం.. రిమాండ్ రిపొర్టులో సంచలనాలు!

9 కోట్ల పరిహారం...

ఆమె అమెరికాలో కంప్యూటర్‌ సైన్స్ లో మాస్టర్స్‌ చేసి ఆ దేశ శాశ్వత నివాసిగా ఉన్నారు. అంతే కాకుండా ఆమె నెలకు 11,600 డాలర్లు సంపాదిస్తున్నారని,ఆమె మృతికి కారణమైన ఆర్టీసీ నుంచి రూ. 9 కోట్ల పరిహారం ఇప్పించాలని మృతురాలి భర్త శ్యాంప్రసాదర్‌ నాగళ్ల సికింద్రాబాద్‌ మోటార్‌ యాక్సిడెంట్స్‌ ట్రైబ్యునల్‌ లో కేసు వేశారు.

వాదనలు విన్న ట్రైబ్యునల్‌ రూ.8.05 కోట్ల పరిహారం చెల్లించాలని ఆర్టీసీని 2014లో ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆర్టీసీ ఆశ్రయించింది. రూ. 5.75 కోట్లు చెల్లించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. తీర్పును సవాలు చేస్తూ మృతురాలి భర్త సుప్రీంకోర్టుకు వెళ్లగా..రూ. 9,64,52,220 పరిహారం కింద చెల్లించాలని ఏపీఎస్‌ఆర్టీసీని ధర్మాసనం ఆదేశించింది. 

Also Read: Samsung Galaxy F06 5G: శామ్‌సంగ్ నుంచి మరో సూపర్ స్మార్ట్ ఫోన్.. ధర రూ.9 వేలే.. ఓ లుక్కేయండి!

Also Read: BSNL New Recharge Plan: ఏంటి భయ్యా నిజమా.. రూ.1500 లకే 365 రోజుల వ్యాలిడిటీ- డైలీ 2జీబీ డేటా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు