/rtv/media/media_files/2025/01/13/Igm9lXbw831FzMmdQXR3.jpg)
Tirupati RTC Bus Accident
Tirupati: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని కళ్యాణీ డ్యాం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. తిరుపతి నుంచి పీలేరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు, మదనపల్లినుంచి తిరుపతికి వస్తున్న మరో ఆర్టీసి బస్సును కళ్యాణి డాం మలుపు వద్ద ఢీకొట్టింది.
20 మంది ప్రయాణికులకు గాయాలు..
ఈ ప్రమాదంలో ఓ డ్రైవర్‌కు తీవ్ర గాయాలవగా దాదాపు 20 మంది ప్రయాణికులకు దెబ్బలు తగిలాయి. గాయపడిన వారిని 108 అంబులెన్సుల ద్వారా చికిత్స నిమిత్తం తిరుపతి రూయా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. సంఘటన స్థలంలో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు కొంత ఇబ్బంది పడ్డారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరు కొని క్షతగాత్రులకు సహాయక చర్యలు చేసి, ట్రాఫిక్ క్లియర్ చేశారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్‌కు క్లోజ్ ఫ్రెండ్ బిగ్ షాక్.. రేవంత్ పై పొగడ్తల వర్షం.. అసలేం జరుగుతోంది?